ఫేక్ సర్టిఫికెట్లపై విచారణ..
జిల్లా వైద్యారోగ్య శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈవో) పోస్టు ఇస్తున్నట్లుగా కొందరు నిరుద్యోగులకు ఫేక్ సర్టిఫికెట్లను జారీ చేసిన ఉదంతం నాలుగు నెలల క్రితమే బయటకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బాధితుల ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులు సైతం విచారణకు ఆదేశించడం..ఇటీవలే డీఎంహెచ్‌వో బాలమురళీకృష్ణ సమక్షంలోనే విచారణాధికారిగా విశాఖపట్నం డీఎంహెచ్‌వో జగదీశ్వరరావు స్వయంగా విచారణ ప్రక్రియ చేపట్టారు. ఈ వ్యవహారంలో బాధితులిచ్చిన ఫిర్యాదు ప్రకారం అనుమానితులుగా ఉన్న సూపరింటెండెంట్ భాస్కరకుమార్, కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్ జి.వి.నరసింహంలపై చర్యలకు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులోనుంచి ఎలాగైనా శాఖాపరమైన చర్యల నుంచి తప్పించుకునేందుకు కొత్తగా దళారీ వ్యవస్థ రంగంలోకి దిగింది. వారిద్దరికీ సహకరించేలా స్థానికంగా శాఖకు చెందిన కీలక అధికారి జేబు నింపేందుకు దళారీ వ్యవహారం సిద్ధమైంది. దీంతో ఈ విచారణ పక్కదారి పట్టే అవకాశాలున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలావుంటే ఈ ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారంపై జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ పిరియా విజయ కూడా సమావేశంలో ఇటీవల ప్రస్తావించి.. అనుమానితులపై శాఖాపరంగా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించిన సంగతి విదితమే. ఏదిఏమైనా వైద్యారోగ్యశాఖలో జరుగుతున్న వరుస అక్రమాలు, అక్రమ వసూళ్ల వ్యవహారం కూటమి ప్రభుత్వం వచ్చాక శృతిమించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment