మెళియాపుట్టి: నడుచుకుంటూ వెళున్న వ్యక్తిని వాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మెళియాపుట్టి మండలకేంద్రంలో మంగళవారం వేకువజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా భిన్నాళ గ్రామానికి చెందిన మదన్ జెన్నా (52) ప్రతి రోజు మెళియాపుట్టి వచ్చి కూరలు అమ్ముతుంటాడు. ఎప్పటిలాగే మంగళవారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో గ్రామానికి చెందిన బిసక్ ప్రధాన్‌తో కలిసి మెళియాపుట్టి బయలుదేరాడు. బిసక్ ప్రధాన్ వ్యక్తిగత పనిపై ఓ చోట ఆగిపోయారు. మదన్ జెన్నా నడుచుకుని వెళ్తుండగా మూడురోడ్ల కూడలి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని ఆపకుండా వెళ్లిపోయింది. తలకు బలమైన గాయం కావడంతో మదన్ అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడి సీసీ కెమెరాలు పరిశీలించగా పాలవ్యాన్ ఈ ప్రమాదానికి కారణమని గుర్తించారు. అనంతరం డ్రైవర్ బొడ్డేపల్లి రోహిత్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. ఎస్సై రమేష్‌బాబు మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్‌మార్టం నిమిత్తం పాతపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మదన్‌కు భార్య ఫుల్లో జెన్నా, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
పాల వ్యాన్ ఢీకొని వ్యక్తి మృతి
Comments
Please login to add a commentAdd a comment