కోచింగ్‌ సెంటర్‌ ఎంపికకు గడువు పెంపు | - | Sakshi
Sakshi News home page

కోచింగ్‌ సెంటర్‌ ఎంపికకు గడువు పెంపు

Mar 27 2025 12:51 AM | Updated on Mar 27 2025 12:51 AM

కోచిం

కోచింగ్‌ సెంటర్‌ ఎంపికకు గడువు పెంపు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో డీఎస్సీ ఉచిత శిక్షణకు ఎంపికై న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్‌లో కోచింగ్‌ సెంటర్‌ ఎంపిక చేసుకునేందుకు ఈ నెల 28 వరకు గడువు పొడిగించినట్లు డీడీ విశ్వమోహన రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

టెన్త్‌ విద్యార్థికి గాయం

నరసన్నపేట: స్థానిక సెంట్‌క్లారెట్‌ స్కూల్లో పరీక్ష రాస్తున్న టెన్త్‌ విద్యార్థి బి.వెంకటరమణ గాయపడ్డాడు. స్కూల్లో గోడకు ఉన్న మేకు తలకు తగలడంతో రక్త స్రావమైంది. వెంటనే పీహెచ్‌సీ సిబ్బంది, మహిళా కానిస్టేబుల్‌ స్పందించి ప్రాథమిక చికిత్స అందించారు. బీపీ చెక్‌ చేసిన అనంతరం పరీక్షకు హజరయ్యాడు. జలుమూరు మండలం బసివాడకు చెందిన వెంకటరమణ నరసన్నపేట మండలం కంబకాయ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు.

గుండెపోటుతో వీఆర్‌ఓ మృతి

ఒత్తిడే కారణమంటున్న ఉద్యోగ సంఘాలు

ఎచ్చెర్ల క్యాంపస్‌: మండలంలోని బడివానిపేట వీఆర్వో పుట్ట రాజారావు (50) బుధవారం గ్రామ సచివాలయంలో విధి నిర్వహణలో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. తోటి సిబ్బంది సీపీఆర్‌ చేసి 108 అంబులెన్సుకు సమాచారం అందించారు. సిబ్బంది వచ్చి రిమ్స్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందారు. రాజారావు స్వస్థలం చిలకపాలెం. ఇతనికి భార్య, కుమా రుడు ఉన్నారు. కాగా, రాజారావు పనిఒత్తిడి కారణంగానే మృతిచెందారని ఉద్యోగ సంఘాల నాయకులు, వీఆర్వోలు చెబుతున్నారు. రెవెన్యూ, మండల పరిషత్‌, పంచాయతీరాజ్‌ ఇలా అన్ని సర్వేలు, పనులు తమతోనే చేయిస్తున్నారని మండిపడుతున్నారు. తాము ఎవరి పనిచేస్తున్నామో తమకే తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లు కూడా ఎక్కువయ్యాయని వాపోతున్నారు. కాగా, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, ఆర్డీఓ సాయిప్రత్యూష, తహశీల్దార్‌ గోపాలరావు బుధవారం రాత్రి రాజారావు ఇంటికి వెళ్లి నివాళులర్పించారు.మృతిపై ఆరా తీశారు.

రాజారావు(ఫైల్‌)

కోచింగ్‌ సెంటర్‌ ఎంపికకు గడువు పెంపు   1
1/1

కోచింగ్‌ సెంటర్‌ ఎంపికకు గడువు పెంపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement