శ్రీకాకుళం న్యూకాలనీ: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ఈనెల 31వ తేదీన జరగాల్సిన సాంఘికశాస్త్రం (సోషల్ స్టడీస్) పరీక్షను ఏప్రిల్ ఒకటో తేదీకి ప్రభుత్వం వాయిదా వేసింది. సో మవారం రంజాన్ పండగ కావడం, ప్రభుత్వ సెలవు దినంగా భావిస్తుండటంతో ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పరీక్ష వాయిదా పడిన విషయాన్ని విద్యార్థులకు, తల్లిదండ్రులకు తెలియజేసేలా హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని డీఈఓ డాక్టర్ తిరుమల చైతన్య విజ్ఞప్తి చేశారు.
ఉగాది, శ్రీరామనవమిలకు ఆప్కో వస్త్రాలపై భారీగా డిస్కౌంట్లు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగలైన ఉగాది, శ్రీరామనవమి సందర్భంగా ఆప్కో వస్త్రాలపై 35 నుంచి 50శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ఆప్కో డివిజనల్ మార్కెటింగ్ అధికారి అనుపమ దాస్ తెలిపారు. ఈ మేరకు శుక్ర వారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆన్‌లైన్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం వంటి ఆన్‌లైన్ స్టోర్స్‌లో కూడా ఆప్కో వస్త్రాలు లభిస్తాయని తెలిపారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఆప్కోహ్యాండ్‌లూమ్.కామ్ వెబ్‌సైట్‌లోనూ కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ఉగాది వేడుకలకు
ఘనంగా ఏర్పాట్లు
శ్రీకాకుళం పాతబస్టాండ్:
శ్రీ విశ్వావసునామ ఉగాది వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు కోరారు. ఉగాది వేడుకల నిర్వహణపై జిల్లా రెవెన్యూ అధికారి చాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని శుక్రవారం నిర్వహించా రు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచనలతో ఈనెల 30వ తేదీన ఉగాది వేడుకలను అంబేడ్కర్ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలుగు వారి సంప్రదాయం ఉట్టిపడే విధంగా మామిడాకుల తోరణాలు, అరటి చెట్లతో అలంకరణలు చేయాలని సూచించా రు. ఉగాది పంచాంగ శ్రవణం, వేదాశీర్వచనం ఏర్పాట్లను దేవదాయశాఖ నిర్వహించాలని ఆదేశించారు. పోలీసు శాఖ శాంతిభద్రత బాధ్యతలు పరిశీలించాలని, ఉగాది పచ్చడి, పులిహోర, చక్రపొంగలి సీ్త్రశిశు సంక్షేమశాఖ, డీఎస్‌ఓ పంపిణీ చేయాలని సూచించారు. వ్యవసాయ, ఉద్యానశాఖకు వేదిక అలంకరణ బాధ్యతలను అప్పగించారు. అలాగే పలు ఏర్పాట్లను ఆయా శాఖలకు అప్పగించారు. సమీక్ష సమావేశంలో జిల్లా ఉద్యాన అధికారి ప్రసాదరావు, డీఎస్‌ఓ సూర్యప్రకాష్, దేవాదాయ సహాయ కమిషనర్ ప్రసాద్ పట్నాయ క్, జిల్లా వ్యవసాయ అధికారి త్రినాథ్ స్వామి, అరసవిల్లి ఈఓ భద్రాజి, సమాచార పౌర సంబంధాల అధికారి కె.చెన్నకేశవరావు, జిల్లా పర్యాటక అధికారి నారాయణరావు, ఆయా శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఏప్రిల్ 1కి సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా
ఏప్రిల్ 1కి సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా


