సామాజిక న్యాయమే లక్ష్యం
ఎచ్చెర్ల క్యాంపస్: సామాజిక న్యాయమే లక్ష్యంగా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ముందుకు సాగారని, ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఐసీఎస్‌ఎస్‌ఆర్ (ఎస్‌ఆర్‌సీ) హానరీ ప్రొఫెసర్ బి.సుధాకర్‌రెడ్డి అన్నారు. ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో సోమవారం ‘విస్మరించబడిన వర్గాలకు సాధికారిత’ అనే అంశంపై రెండు రోజుల సదస్సు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ మార్గం అనుసరణీయమన్నారు. ప్రపంచ మేధావుల్లో అంబేడ్కర్ అగ్రస్థానంలో ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో వీసీ రజిని, వర్సిటీ అధికారులు పాల్గొన్నారు.


