మెగా డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత ఆన్‌లైన్ శిక్షణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: మెగా డీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన బీసీ, ఈడబ్ల్యూఎస్ (ఈబీసీ), ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఉచిత ఆన్‌లైన్ శిక్షణను అందిస్తోందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. తెలుగు ఇంగ్లిష్ మీడియంలలో అందుబాటులో ఉండే ఈ శిక్షణ కు టెట్‌లో ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు. టెట్ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు త మ పదో తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ మార్కుల జాబితాలు, టెట్ మార్కుల జాబితా, కుల ఆదా య ధ్రువీకరణ పత్రాలు (రూ. 2 లక్షల లోపు), రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో శ్రీకాకుళం పట్టణంలోని 80 ఫీట్ రోడ్, టీడీపీ భవనం వెనుక ఉన్న బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు 7382975679, 9295653489 నంబర్లను సంప్రదించగలరని సూచించారు.


