చిల్లర వేషాల గణేశా..
‘గణపతి.. నేను మల్లేష్‌ను.. గ్రూపులో ఎగ్జిట్ ఎందుకు కొట్టావు.. నువ్వు ఎవడవు.. తీయడానికి....పోస్టులు పెడితే తీసేస్తావా... ఏ ఫొటోలు పెట్టాను.. ఎంపీ, మంత్రి, దాసునాయుడు ఫొటోలు పెట్టాను.. అంతమాత్రాన తీసేస్తావా? పార్టీ గ్రూపులో ఎలా తీస్తావ్. నన్ను తీయడానికి నువ్వెవడివి. పార్టీ కోసం పనిచేశాను. నీలా చిల్లర పనులు చేయిలేదు. టిఫిన్ కొట్టోళ్లు, చిల్లర వ్యాపారులు కడుపు కొట్టలేదు.
– నరసన్నపేటకు చెందిన టీడీపీ నాయకుడు మల్లేష్ వాయిస్ ఇది..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పీఏ గణపతి, స్థానిక టీడీపీ నాయకుడు మల్లేష్‌ల మధ్య వివాదం రాజుకుంది. ఒకరిపై ఒకరు నోటికొచ్చినట్టు మాట్లాడుకున్నారు. పచ్చిబూతులు తిట్టుకున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ రెచ్చిపోయారు. వారి ‘వ్యవహారాలను’ వారే బయట పెట్టుకున్నారు. ఇందులో బగ్గు రమణమూర్తి ప్రైవేటు పీఏ గణపతి ఒక అడుగు ముందుకేసి పాతేస్తాను.. తంతాను...అంటూ దర్పాన్ని చూపించగా, టిఫిన్ కొట్టులపై బ్రోకర్ పని చేశావ్. చిన్నోళ్ల కడుపుకొట్టడం... డబ్బులిచ్చినోళ్లకే పనులు చేశావు. నువ్వు చేసేదేంటి? అంటూ టీడీపీ నాయకుడు మల్లేష్ చెలరేగిపోయారు. ఈ ఇద్దరి ఫోన్ సంభాషణ ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీలో చిచ్చు రేపింది. ఇది ఎక్కడికి దారితీస్తుందో చూడాలని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
బగ్గు పీఏ వర్సస్ టీడీపీ నేత
నోటికొచ్చిన బూతులు తిట్టుకున్న ఇరువురు
వాట్సాప్ గ్రూపులో పోస్టులు పెట్టడంతో వివాదం
నరసన్నపేట నియోజకవర్గంలో హాట్‌టాపిక్‌గా మారిన వ్యవహారం


