శ్రీకాకుళం
ఉపాధి.. ఆశలకు సమాధి
అనుమానాస్పద మృతి
వివాహిత అనుమానాస్పదంగా మృతి
చెందారు. సంతవురిటిలో ఘటన జరిగింది. –8లో
క్రీడాకారులతో ఆటలా..?
బుధవారం విజయవాడలో పలు పోటీలు జరగనున్నాయి. సమాచారం మాత్రం మంగళవారం సాయంత్రం ఇచ్చారు. –8లో
బుధవారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
వెండర్స్ వెర్సెస్ అధికారులు
ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో డ్వామా అధికారుల పరిస్థితి అయోమయంగా తయారైంది. చేసిన పనికి వేతనాలు చెల్లించాలంటూ ఒకవైపు కూలీలు నిలదీస్తుండగా, మరోవైపు వెండర్స్ కూడా గట్టిగానే సతాయిస్తున్నారు. పనులు చేయించుకుని మోసం చేశారంటూ డ్వామా అధికారులకు ఫోన్ చేసి మండిపడుతున్నారు. ఈ క్రమంలో హ్యాపీ కన్‌స్ట్రక్షన్ ఏజెన్సీ పేరుతో గోకులాలు నిర్మించిన ఓ వెండర్ తాజాగా డ్వామా పీడీ సుధాకర్‌కు ఫోన్ చేసి గట్టిగా అడిగారు. ఆయన అడగడంలో అర్థం ఉన్నప్పటికీ అడిగే తీరులో తేడా ఉండటంతో పీడీ కూడా ధీటుగా స్పందించారు. ఇద్దరి మధ్య ఫోన్‌లో వాగ్వాదం జరిగింది. మోసం చేశారనే పదం వెండర్ నుంచి రావడంతో పీడీ కాసింత సీరియస్ అయ్యారు. పై నుంచి నిధులు వస్తే మీ ఖాతాలో పడతాయని.. ఇందులో మా పాత్ర ఏముంటందని పీడీ అనగా, నిధులు ఇస్తామంటేనే పనులు మొదలు పెట్టామని వెండర్ బదులిచ్చారు. మాటామాటా పెరిగి ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఇప్పుడా ఫోన్ సంబాషణ వాట్సాప్ గ్రూపుల్లో హల్‌చల్ చేస్తోంది. ఇదే విషయమై డ్వామా పీడీ సుధాకర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా త్వరలోనే నిధులొచ్చేస్తాయని, అంతవరకు వెండర్స్ ఓపిక పట్టాలని, వేతనదారులకు కూడా కేంద్రం నుంచి రాగానే చెల్లింపులు జరిగిపోతాయని చెప్పారు.
ఈ రోడ్డు చూడండి. మెళియాపుట్టి మండలంలోని దీనబంధుపురం పంచాయతీ చింతల కోలూరు నుంచి అచ్చనాపురం వరకు ఐదు బిట్లు కింద రూ.2కోట్ల వ్యయంతో వేసిన రోడ్డు ఇది. మెటల్ వేసి వదిలేశారు. దీంతో ఆ రోడ్డుపై రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత రెండు నెలలుగా ఇదే పరిస్థితి.
కూలీల ఆకలి కేకలు..
మెటీరియల్ కాంపోనెంట్ కింద చేపట్టిన పనులకే కాదు ఉపాధి హామీ పథకం కింద చెరువు తదితర పనులు చేస్తున్న కూలీలకు కూడా వేతనాలు చెల్లించలేదు. గత మూడు నెలలుగా చెల్లింపులు చేయకపోవడంతో కూలీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జిల్లాలో 2లక్షల మంది కూలీలకు రూ.85కోట్ల మేర చెల్లింపులు చేయాల్సి ఉంది. మూడు నెలలుగా చేసిన పనులకు డబ్బులు రాకపోవడంతో కూలీల వేదన చెప్పనక్కర్లేదు.
● ఉపాధి హామీ పథకానికి గడ్డు కాలం
● వేతనాల్లేక కూలీల ఆకలి కేకలు
● మూడు నెలలుగా రూ.85 కోట్ల మేర వేతనాలు చెల్లించని వైనం
● పల్లె పండగకు పైసల్లేక పనుల నిలిపివేత
● రూ.200 కోట్ల మేర బకాయిలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
ఉపాధి హామీ పథకానికి గడ్డు కాలం నడుస్తోంది. ఫలితంగా పల్లె పండుగ కాగితాలకు పరిమితమైపోయింది. మూడు నెలలుగా కూలీలకు వేతన బకాయిలు చెల్లించడం లేదు. వేతనాలే కాదు పల్లె పండగ పేరుతో చేపట్టిన అభివృద్ధి పనులకు కూడా నిధులు విడుదల చేయలేదు. బిల్లులు రాకపోవడంతో ఆ పనులు చేస్తున్న వెండర్స్ అదే టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉమ్ము తడి పనులు చేస్తున్నారు. దీంతో సంక్రాంతికి పూర్తి కావాల్సిన పల్లె పండగ పనులు మరో ఏడాది గడిచినా పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ చేసిన హడావుడి, ప్రకటనలు మాటలకే పరిమితమయ్యాయి. అధికారంలోకి రాగానే పల్లె పండగ పేరుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. సంక్రాంతి కల్లా పల్లెల రోడ్లన్నీ ఒక్కసారిగా మారిపోతాయన్న బిల్డప్ ఇచ్చారు. కానీ, పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఇప్పటికే వేసిన రోడ్లు కూడా నాసిరకంగా ఉన్నాయి. నాలుగైదు నెలల్లో వర్షాలు పడితే వచ్చే సంవత్సరం మళ్లీ అవే రోడ్లు పునర్నిర్మాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
నిధుల సమస్య..
వెండర్స్ కక్కుర్తి
పల్లెలో పంచాయతీ సర్పంచ్‌ల ద్వారా జరగాల్సిన ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ పనులను వెండర్స్ పేరుతో టీడీపీ నాయకులకు అప్పగించారు. ఇంకేముంది దాహంతో ఉన్న పచ్చనేతలు ఉపాధి పనులను క్యాష్ చేసుకున్నారు. ఇష్టారీతిన, పద్ధతి లేకుండా కొన్ని చోట్ల రోడ్లు వేశారు. మరికొన్నిచోట్ల మధ్యలో వదిలేశారు. దీనికంతటికీ నిధుల సమస్య ఒకటైతే... నాయకుల కాసుల కక్కుర్తి మరో కారణంగా చెప్పవచ్చు. పల్లె పండగ కింద జిల్లాలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధుల కింద 6300 పనులు మంజూరు చేశారు. వాటిలో 4 వేల పనులు మాత్రమే ప్రారంభమయ్యాయి. వీటిలో 2400 పనుల వరకు పూర్తయ్యాయి. మరో 1600 పనులు ప్రారంభ దశ నుంచి మధ్యలో ఉన్నాయి. పూర్తయిన, ప్రగతిలో ఉన్న పనులకు రూ. 293కోట్లు ఖర్చు కాగా ప్రభుత్వం కేవలం రూ.93కోట్లు మాత్రమే విడుదల చేసింది. గత ఏడాది డిసెంబర్ నుంచి నిధులు నిలిపివేసింది. దీంతో మూడు నెలలుగా పల్లె పండగ పనులకు నిధులు విడుదల కాని దుస్థితి చోటు చేసుకుంది. దీంతో కొందరు హడావుడిగా నాసిరకం పనులు చేపట్టగా, మరికొందరు అరకొర పనులు చేసి వదిలేశారు.
నిధులు విడుదల కావాల్సిన వాటిలో పవన్ కల్యాణ్ శాఖకు చెందిన పంచాయతీరాజ్ పరిధికి సంబంధించి రూ.156కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, మెటల్ రోడ్లు, సీసీ డ్రైన్లు, కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి. అలాగే, ట్రైబల్ వెల్ఫేర్‌కు సంబంధించి రూ.18కోట్లు, సర్వశిక్షా అభియాన్‌కు సంబంధించి రూ.7కోట్లు, ఆర్‌అండ్‌బీకి సంబంధించి రూ.10కోట్లు, ఎంసీసీ పనులకు సంబంధించి(గోకులాలు, పశువుల నీటి తొట్టెలు) రూ. 30కోట్ల వరకు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. నిధులు వస్తేనే తినేసి వెండర్స్ ఉండగా, నిధులు రాకపోతే ఆ పనులు ఎలా చేస్తారో అర్థం చేసుకోవచ్చు. పల్లె పండగ పనులన్నీ ఇప్పుడలానే ఉన్నాయి.
న్యూస్‌రీల్
శ్రీకాకుళం
శ్రీకాకుళం
శ్రీకాకుళం
శ్రీకాకుళం


