రైలు ఢీకొని వ్యక్తి మృతి
ఆమదాలవలస/బూర్జ: శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్ పరిధిలో వెంగళరావు కాలనీ సమీపంలో అప్‌లైన్ ట్రాక్‌పై మంగళవారం రైలు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. జీఆర్‌పీ ఎస్‌ఐ మధుసూదనరావు తెలిపిన వివరాల ప్రకారం.. బూర్జ మండలం పాలవలస గ్రామానికి చెందిన సురవరపు శ్రీనివాసరావు(42) టాటా ఏస్ వ్యాన్ నడుపుతుంటాడు. ప్రతిరోజూ పాలకొండ నుంచి శ్రీకాకుళం కర్రపొట్టు తరలిస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆమదాలవలస రైల్వేస్టేషన్ సమీపంలో ట్రాక్ దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. శ్రీనివాసరావుకు భార్య భవాని, కుమార్తె స్పందన, కుమారుడు చైతన్య ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు జీఆర్‌పీ పోలీసులు తెలిపారు. శ్రీనివాసరావు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.


