కల్యాణం.. కమనీయం..
పాతశ్రీకాకుళంలో కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న నాగావళి నదీతీరంలో కల్యాణ వేంకటేశ్వర స్వామి వార్షిక తిరుక్కల్యాణోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. శ్రీకూర్మం దేవస్థానం అర్చకుడు గోపినంబాళ్ల నల్లకూర్మానదాసు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు బూరాడ వంశీకృష్ణ నేతృత్వంలో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామివారి ఉత్సమూర్తులను ప్రత్యేక మండపంపై ఉంచి మల్లె, బంతి వంటి పూలతో మండపాన్ని అలంకరించారు. ఉత్సమూర్తులను వేదికపై ఉంచి వేదమంత్రాల నడుమ కల్యాణం జరిపించారు. అంతకుముందు నిర్వహించిన శోభాయాత్ర ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఎల్.నందికేశ్వరరావు, బెహరా నాగేశ్వరరావు, మర్రి యోగేశ్వరరావు, అదిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
–శ్రీకాకుళం కల్చరల్
కల్యాణం.. కమనీయం..
కల్యాణం.. కమనీయం..


