సారా నిర్మూలనకు నవోదయం 2.0
పాతపట్నం: నాటుసారా నిర్మూలనకు ప్రభుత్వం నవోదయం 2.0 కార్యక్రమం చేపడుతోందని జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ డి.శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పాతపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఒడిశా, ఆంధ్ర చెక్‌పోస్ట్‌లను బుధవారం పరిశీలించారు. అనంతరం పాతపట్నం ఎకై ్సజ్ సీఐ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒడిశా నుంచి ఆంధ్రకు నాటుసారా, మద్యం రవాణా చేసే రహదారుల వద్ద తనిఖీలు విస్తృతం చేయాలన్నారు. సరిహద్దు గ్రామాలపై దృష్టి సారించాలన్నారు. కొండపై ఉన్న గూడలకు వెళ్లి తనిఖీలు చేపట్టాలని సూచించారు. సారా రహిత జిల్లాగా చేయాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. ఆయనతో పాటు పాతపట్నం ఎకై ్సజ్ సీఐ కె.కృష్ణారావు, ఎస్‌ఐ శ్రీనివాసరావు ఉన్నారు.


