మానవత్వం చాటుకున్న ఏపీఓ
ఇచ్ఛాపురం రూరల్: సాటి మనిషి కష్టాల్లో ఉంటే ఎగతాళి చేసే ఈ రోజుల్లో రోడ్డు ప్రమాదానికి గురైన ఓ ఉద్యోగికి సపర్యాలు చేసి మానవత్వాన్ని చాటుకున్నాడు మరో ఉద్యోగి. కంచిలి మండలం ఎం.ఎస్.పల్లి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణదాసు అనే ఒరియా ఉపాధ్యాయుడు ఒడిశా పాటి సున్నాపురం ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్నా రు. గురువారం విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఇన్నేశుపేట వద్ద ఎదురుగా బుల్లెట్ బండిపై వస్తున్న తులసిగాం యువకులు బలంగా ఢీ కొట్టారు. ఈ ఘటనలో ఉపాధ్యాయుడి కి కాలు విరిగిపోవడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. అదే సమయంలో అటువైపుగా వస్తున్న ఉపాధి హామీ పథకం ఏపీఓ పెట్ల శ్రీనివాసరావు వెంటనే క్షతగాత్రుడ్ని తన ఒడిలోకి తీసుకొని సపర్య లు చేశారు. అటువైపుగా వెళ్తున్న ఉపాధి కూలీల సహాయంతో ఎండ తగలకుండా చీరను పరదాగా చేసి 108 అంబులెన్సుకు సమాచారం అందించి ఇచ్ఛాపురం ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఈ.శ్రీనివాస్ తెలిపారు.
లక్ష్మీనారాయణదాసుకు సపర్యలు చేస్తున్న
ఏపీఓ శ్రీనివాసరావు
త్రీస్టాప్.. నో స్టార్ట్


