విద్యుత్ షాక్‌కు గురై.. విద్యుత్ షాక్‌కు గురై ఓ వ్యక్
హైకోర్టు ఆదేశాలున్నా..
నక్షత్ర తాబేళ్లు అంతరించిపోతున్న అరుదైన జాతుల్లో ఉన్నాయి. భారతీయ వన్య ప్రాణ సంరక్షణ చట్టంలో ఈ నక్షత్ర తాబేళ్లు షెడ్యూల్ 4వ జాబితాలో ఉన్నాయి. వీటిని బంధించినా, తరలించినా కఠిన శిక్షలు అమలవుతాయి. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉండటం, అతి పురాతనమైన ఆలయం కావడం వలన కూర్మనాథాలయంలో తాబేళ్లను ఉంచవచ్చని, వాటిని సంరక్షణను చూడాల్సిన బాధ్యతను దేవదాయ శాఖ చేపట్టాలని హైకోర్టు స్పష్టంగా పేర్కొంది. సుమారు 15 ఏళ్ల క్రితం తాబేళ్ల సంరక్షణపై మీడియాలో కథనాలు రావడంతో వీటిపై హిందూ ధార్మిక సంఘాలు, వన సంరక్షణ ప్రేమికులు కోర్టులో కేసులు దాఖలు చేశారు. నిపుణుల ఆధ్వర్యంలో పార్కును ఏర్పాటు చేయాలని, వీటిని దేవదాయ ధర్మాదాయ శాఖతో పాటు అటవీ శాఖ అధికారులు తరచూ పరిశీలన చేయాలని ఆ తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు. అదే సమయంలో కృష్ణం వందే జగద్గురుమ్ అనే సంస్థ ఇప్పుడున్న తాబేళ్ల పార్కును నిర్మించింది. పార్కులో నీటి తొట్టెలు, వివిధ రకాలైన మొక్కలతో పాటు ఇసుక తిన్నెలు ఏర్పాటు చేసింది.


