దేవుడి మీద భారంశివాలయ అర్చకుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. సాయం కోసం అర్థిస్తున్నాడు. –8లో | - | Sakshi
Sakshi News home page

దేవుడి మీద భారంశివాలయ అర్చకుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. సాయం కోసం అర్థిస్తున్నాడు. –8లో

Apr 21 2025 12:49 AM | Updated on Apr 21 2025 12:49 AM

దేవుడ

దేవుడి మీద భారంశివాలయ అర్చకుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా

చాలా ఏళ్ల తర్వాత జిల్లాలో మళ్లీ బీచ్‌ ఫెస్టివల్‌ జరిగింది. బారువలో నిర్వహించిన ఈ ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రితో సహా వక్తలంతా కూర్మ రక్షణపై పెద్ద పెద్ద బాసలు చేశారు. నక్షత్ర తాబేళ్ల పిల్లలను సాగరంలోకి విడిచిపెట్టారు. బాగానే ఉంది. కానీ సాక్షాత్తు శ్రీమహా విష్ణువు కూర్మావతారంలో వెలసి పూజలందుకుంటున్న ప్రపంచంలోనే అరుదైన పుణ్యక్షేత్రం శ్రీకూర్మంలో విష్ణు స్వరూపమైన తాబేళ్ల హననం నిత్యకృత్యంగా మారింది. కూర్మాల మృత్యుఘోష స్థానికులను, భక్తులను కలవరపాటుకు గురిచేస్తోంది. వాటి రక్షణకు పాలకులు చర్యలు చేపట్టకపోగా.. మృత్యువాత పడుతున్న తాబేళ్లను ఆలయం వెనుక భాగంలోనే దహనం చేస్తూ ఆలయ పవిత్రతను దెబ్బ తీస్తున్నారు. ఇది చూసి మాటల్లో కాకుండా చేతల్లో నిజాయితీ చూపని నేతల తీరును ప్రజలు గర్హిస్తున్నారు. – గార

బారువలో తాబేళ్లను సముద్రంలోకి విడిచిపెడుతున్న దృశ్యం

ప్రజల్లో ప్రకృతి పరిరక్షణ పట్ల అవగాహన కల్పించడం, ముఖ్యంగా అంతరించిపోతున్న ఆలివ్‌ రిడ్లే తాబేళ్ల ప్రాముఖ్యతను తెలియజేయడమే ప్రధాన ఉద్దేశంగా ఈ నెల 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు సోంపేట మండలం బారువ తీరంలో బీచ్‌ ఫెస్టివల్‌ పేరుతో అధికారులు ఏర్పాటు చేశారు. ఆలివ్‌ రిడ్లే తాబేళ్ల పిల్లలను సాగరంలోకి విడిచిపెట్టారు. తాబేళ్ల సంరక్షణ కోసం అటవీశాఖ తీసుకుంటున్న చర్యల్ని వివరిస్తూ.. ప్రత్యేక ప్రదర్శనల్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన ద్వారా తాబేళ్ల జీవిత చక్రం, వాటికి ఎదురవుతున్న సవాళ్లు, వాటిని రక్షించడానికి మనం చేయగలిగే పనులు వంటి విషయాలను ప్రజలు అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలకు కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చాలా హడావిడిగా కార్యక్రమాలు చేశారు.

ూర్మనాథాలయం ఈఓ కార్యాలయం వెనుక భాగంలో మంటల్లో సగం కాలిపోయి ఉన్న తాబేళ్లు

కూర్మనాథాలయం ఈఓ కార్యాలయం వెనుక భాగంలో మంటల్లో సగం కాలిపోయి ఉన్న తాబేళ్లు

ది కూర్మక్షేత్రం శ్రీకూర్మనాథాలయంలో తాబేళ్లు మరణిస్తున్నాయి. దేవుడి ప్రతిరూపంగా ఇక్కడ తాబేళ్లను కొలుస్తారు. అలాంటిది ఇవి పదు ల సంఖ్యలో చనిపోతున్నా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. పైగా చనిపోయిన తాబేళ్లను ఆలయ ఈఓ కార్యాలయం వెనుక భాగంలోనే దహనం చేస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ తాబేళ్లు అనారోగ్య పరిస్థితుల్లో చనిపోతే తప్పనిసరిగా పోస్టుమార్టం నిర్వహించాలి. గతంలో ప్రతి తాబే లుకి నంబర్‌ కూడా కేటాయించేవారు. పార్కులో ఎన్ని ఉన్నాయి, వాటి ఆరోగ్య పరిస్థితులు రికార్డు చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. అటవీ అధికారుల పర్యవేక్షణ లోపం వల్లనే తాబేళ్లు చనిపోతున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అరుదైన నక్షత్ర తాబేళ్లు...

ఈ ఆలయంలో ఉండేవి నక్షత్ర తాబేళ్లు. తరతరాలుగా వీటిని ఇక్కడే భక్తుల పూజించడం వల్ల ఆలయంలో పెంపకం జరుగుతోంది. ఆలయం దక్షిణ ద్వారం వద్ద తాబేళ్ల సంరక్షణ కోసం ప్రత్యేకంగా తాబేళ్ల పార్కును నిర్మించారు. వీటి కోసం ప్రతి నెలా రూ. 24 వేలు ఆహారంతో పాటు మెడికల్‌ ఖర్చుల కోసం జిల్లాకు చెందిన గ్రీన్‌మెర్సీ సంస్థకు దేవదాయ శాఖ అప్పగించింది. అయితే తాబేళ్ల సంరక్షణ సరిగ్గా లేకపోవడం, వాటి ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు పరీక్షలు జరగాల్సి ఉన్నా అవేమీ లేకపోవడంతో అనారోగ్యం బారిన పడుతున్నాయని భక్తులు చెబుతున్నారు. అదే సమ యంలో కొన్ని నెలల క్రితం నుంచి భక్తుల వద్ద నుంచి తాబేళ్ల ఆహారం కోసం విరాళాలు తీసుకునేందుకు ప్రత్యేక కౌంటర్‌ కూడా ఏర్పాటు చేశారు. వీటి ద్వారా వచ్చిన ఆదాయంపై ఉన్న దృష్టి వాటి సంరక్షణపై లేదని భక్తులు మండిపడుతున్నారు.

ఏదీ సంరక్షణ..

తాబేళ్ల పార్కులో గతంలో తాబేళ్ల పిల్లలు వచ్చే సమయంలో ప్రత్యేకంగా టబ్బులో వీటిని ఉంచి రక్షణ చర్యలు చేపట్టేవారు. ఎన్ని జన్మించాయి, వాటి వివరాలు, చనిపోయిన వివరాలు రికార్డులో నమోదు జరగాల్సి ఉన్నా అవేమీ జరగడం లేదని పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. ఈ విషయమై ఆలయ సిబ్బంది నర్సుబాబు వద్ద ప్రస్తావించగా ఏడు తాబేళ్లు చనిపోయి ఉన్నాయని, ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామన్నారు.

పోస్ట్‌మార్టం చేయకుండానే..

నక్షత్ర తాబేళ్లు మరణిస్తే వాటికి అటవీశాఖ ఆధ్వర్యంలోని వెటనేరియన్‌ అధికారి సమక్షంలో పోస్టుమార్టం చేయడం తప్పనిసరి అని నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఆలయంలో అలా జరగడం లేదు. ఎక్కడ పడితే అక్కడ పాతేయడం.. దహనం చేయడం లాంటివి చేయడం చట్టరీత్యా నేరం. కానీ ఇక్కడ ఆలయ ప్రహరీ సమీపంలో దహనం చేసేస్తున్నారు. వీటి మరణాలపై అంత్య గోప్యత ఎందుకని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

‘లెక్క’లేని తనం..

ఐదేళ్ల క్రితం నక్షత్ర తాబేళ్ల సంతతి 280 వరకు ఉండేదని స్థానికులు చెబుతున్నారు. వాటి సంతతి వృద్ధి చెంది తాబేళ్ల సంఖ్య మరింత పెరగాలి. కానీ అలా జరుగుతున్న దాఖలాలు ఇక్కడ కనిపించడం లేదు. ప్రస్తుతం ఎన్ని తాబేళ్లు ఉన్నాయో అనే లెక్క కూడా ఆలయ అధికారుల వద్ద లేకపోవడం శోచనీయం. అలాగే తాబేళ్ల పార్కు దగ్గర వాటి సంరక్షణ కోసం విరాళాల సేకరణ కోసం చూపే శ్రద్ధ వాటి పరిరక్షణ మీద లేకపోవడం అత్యంత దారుణమని భక్తులు ఆరోపిస్తున్నారు.

ఈ ఏడాది రెండు లక్షల తాబేలు పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు సముద్రంలోకి విడిచి పెట్టకుండా సేఫ్‌ డిస్పోజ ల్‌ చేయాలి. జిల్లాలో 16 కేంద్రాలు ద్వారా తాబేళ్ల పిల్లలను సంరక్షించి సముద్రంలోకి విడిచి పెట్టడం జరుగుతుంది. ఈ అంతరించిపోతున్న జీవజాతులను కాపాడాల్సిన బాధ్యత ప్రతీ పౌరునిపై ఉంది. తాబేళ్లను రక్షించడానికి స్థానిక మత్స్యకారులు సహాయ సహకారాలు అవసరం.

– బీచ్‌ ఫెస్టివల్‌ ప్రారంభోత్సవంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

ప్రతి నెలా నివేదికలిస్తున్నాం

శ్రీకూర్మనాథుడి ఆలయంలోని తాబేళ్ల పార్కు లో ఉన్న తాబేళ్లు, వాటి ఆరోగ్య పరిస్థితులపై ప్రతి నెలా జిల్లా కలెక్టర్‌, జిల్లా అట వీ శాఖాధికారికి నివేదికలు పంపిస్తున్నాం. పార్కులో ఉన్నంత వరకు లెక్క కచ్చి తంగానే ఉంది. ఆరోగ్య పరీక్షలు, ఆహారం ఏర్పా ట్లు నిపుణుల సూచన మేరకు నిర్వహిస్తున్నాం.

–రమణమూర్తి, గ్రీన్‌మెర్సీ సంస్థ, శ్రీకాకుళం

ప్రకృతి పరిరక్షణ.. తాబేళ్ల సంరక్షణ

బీచ్‌ ఫెస్టివల్‌లో అధికారులు,

ప్రజాప్రతినిధులు

కూర్మనాథా రక్షమాం..

శ్రీకూర్మనాథాలయంలో

తాబేళ్ల మృత్యువాత

ఈఓ కార్యాలయం వెనుకనే తాబేళ్లను దహనం చేస్తున్న వైనం

తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న భక్తులు

దేవుడి మీద భారంశివాలయ అర్చకుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా1
1/2

దేవుడి మీద భారంశివాలయ అర్చకుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా

దేవుడి మీద భారంశివాలయ అర్చకుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా2
2/2

దేవుడి మీద భారంశివాలయ అర్చకుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement