అపచారంపై భగ్గుమన్న భక్తజనం
● శ్రీకూర్మంకు పరుగులెత్తిన అధికార గణం
● బట్టబయలైన ‘గ్రీన్‌మెర్సీ’ నిర్లక్ష్య వైఖరి
● పొంతనలేని లెక్కలు..
నిజాన్ని దాచే ప్రయత్నాలు
● పత్రికా కథనాలపై కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి అధికారులు
● బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన భక్తులు, వీహెచ్‌పీ సభ్యులు
● పర్యవేక్షణలో డొల్లతనంపై స్థానిక ఎమ్మెల్యే సీరియస్
గార:
వేల ఏళ్లుగా శ్రీకూర్మంలో విరాజిల్లుతున్న కూర్మనాథ క్షేత్రం సాక్షిగా అపురూప నక్షత్ర తాబేళ్ల సంరక్షణపై నిర్లక్ష్యపు నీడ కమ్ముకుంటోంది. సాక్షాత్తు ఆ దేవుడి ఎదుటే కూర్మాల ఆయుష్షు తగ్గిపోతోంది. ఈ వైఖరి భక్తుల మనసు తీవ్రంగా కలిచివేస్తోంది. తాబేళ్ల మరణ మృదంగంపై వచ్చిన వార్తలు చూసిన కూర్మనాథుని భక్తులు ఆలయ నిర్వాహకులతో పాటు తాబేళ్ల పార్కు నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పొంతన లేకుండా సమాధానం చెబుతున్న తీరుపై మండిపడ్డారు. కళ్ల ముందు అంతా కనిపిస్తుంటే కప్పి పుచ్చడానికి ప్రయత్నాలు చేస్తుండడాన్ని ఖండిస్తున్నారు. స్థానికులతో పాటు భక్తులు, వీహెచ్‌పీ సభ్యులు, రాజకీయ నాయకులు అంతా సోమవారం కూర్మనాథ క్షేత్రానికి క్యూ కట్టారు.
అంతా హడావుడే.. తేలని లెక్క
కూర్మనాథాలయంలో తాబేళ్ల మృత్యుఘోష.. దహనంపై వివిధ విభాగాల అధికారులు ఆలయాన్ని సందర్శించారు. ఘటనపై ఆరా తీశారు. కానీ పార్కులో ఉన్న తాబేళ్ల సంఖ్య ఎంత.. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి.. అనే అంశంపై మాత్రం ఎవరూ దృష్టిసారించిన దాఖలాలు లేవు. తాబేళ్ల పార్కు నిర్వహణ బాధ్యతలు చూసుకునే గ్రీన్‌మెర్సీ సంస్థ నిర్వాహకుడు మాత్రం 212 ఉండాలని, రికార్డు ప్రకారం అంతే ఉన్నాయని చెప్పడం విశేషం. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ రికార్డుల నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యవేక్షణ అధికారి సంతకాలు లేకపోవడాన్ని ప్రశ్నించారు.
25 ఎక్కడ నుంచి వచ్చాయో..
కూర్మనాథాలయం ఈవో కార్యాలయం వెనక భాగంలో దహనం చేసిన.. కళేబరాలుగా ఉన్న తాబేళ్ల సంఖ్య 25గా అధికారులు గుర్తించారు. వాటిలో 8 తాబేళ్లను పోస్టుమార్టం కోసం పంపించారు. పార్కులో మొత్తం తాబేళ్ల సంఖ్య 212 ఉండాలని.. రికార్డుల ప్రకారం సరిపోయాయని.. గ్రీన్‌మెర్సీ మూర్తి సమాధానం ఇవ్వడం వెనక ఆంతర్యమేమిటని భక్తులు మండిపడుతున్నారు. మరి లెక్క సరిపోతే మరణించిన తాబేళ్లు ఎక్కడ్నుంచి వచ్చాయని.. ప్రశ్నిస్తున్నారు.
అడ్డుకట్ట వేయాలి
పురాతనమైన కూర్మక్షేత్రంలో స్వామి ప్రతిరూపంగా భావిస్తున్న తాబేళ్ల మృతికి అడ్డుకట్ట వేయాలని గార మండల ఎంపీపీ గొండు రఘురాం, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు పీస గోపి, పార్టీ యువజన విభాగం అధ్యక్షడు మార్పు దుర్గా పృథ్వీరాజ్
అపచారంపై భగ్గుమన్న భక్తజనం
అపచారంపై భగ్గుమన్న భక్తజనం


