ర్యాంకు
జోషిబాబుకు
790
సివిల్ సర్వీస్ ఫలితాల్లో కోటబొమ్మాళి మండలం చలమయ్యపేటకు చెందిన లింగూడు జోషిబాబు 790వ ర్యాంకు సాధించారు. తండ్రి బాలయ్య మాజీ సైనిక ఉద్యోగి. తల్లి రాజ్యలక్ష్మి గృహిణి. జోషిబాబు 1 నుంచి 10వ తరగతి వరకు టెక్కలిలో ఓ ప్రైవేట్ స్కూల్‌లో చదివారు. విశాఖలో ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్, ఆంధ్రా యూనివర్శిటీలో మైరెన్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 2021లో ఢిల్లీలో సివిల్స్ కోచింగ్‌లో చేరారు. 2022లో సివిల్స్‌లో అర్హత సాధించలేకపోయారు. రెండో ప్రయత్నంలో తాజాగా 790వ ర్యాంకు సాధించారు. జోషిబాబుకు సివిల్స్‌లో ర్యాంకు రావడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. – టెక్కలి
వ


