దేవదాయ శాఖ నిద్రమత్తు వీడాలి
● శ్రీకూర్మనాథాలయ ధర్మకర్త పూసపాటి అశోకగజపతిరాజు
గార: వరుస ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో దేవదాయ శాఖ నిద్రమత్తు వీడాలని శ్రీకూర్మనాథాలయ ధర్మకర్త పూసపాటి అశోకగజపతిరాజు అన్నారు. నక్షత్ర తాబేళ్ల దహనం నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఆలయాన్ని సందర్శించారు. స్వామి దర్శన అనంతరం మాట్లాడు తూ నక్షత్ర తాబేళ్లు ఇక్కడ ఉంటేనే దైవాంశం ఉంటుందన్నారు. ఎక్కడికో తరలించడం వల్ల ఆలయానికి ప్రాశస్త్యం తగ్గుతుందన్నారు. దేవదాయ శాఖ ధర్మకర్తలను గౌరవించాలని, దేవాలయ పరిస్థితులపై సమాచారాన్ని తెలియజేయాలని అన్నారు. కూర్మనాథస్వామి ఆభరణాలు దశాబ్దాలుగా సింహాచలం దేవస్థానంలో ఉన్నాయని, ఇక్కడ ఉంచితే బాగుంటుందన్నారు. దీనిపై ఎమ్మెల్యే శంకర్ స్పందిస్తూ నగలు ఇక్కడే ఉంచాలని అధికారులకు తెలియజేశామని చెప్పారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ డీసీ సుజాత, జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఇన్‌చార్జి వై.భద్రాజీ తదితరులు పాల్గొన్నారు.


