పర్యాటకులపై ఉగ్రదాడి దారుణం
జమ్మూ కశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాదుల దుశ్చర్య పిరికిపందల చర్య అని కేంద్ర, రాష్ట్రమంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ దాడిని నిరసిస్తూ బుధవారం రాత్రి శ్రీకాకుళం నగరంలోని సూర్యమహల్ కూడలి నుంచి డే అండ్ నైట్ కూడలి వరకూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచనలతో నిన్నటికే 35 విమానాలను ఏర్పాటు చేసి, 4,500 మంది పర్యాటకుల్ని వారి స్వస్థలాలకు చేర్చామన్నారు. దాడిలో శ్రీకాకుళం నగరానికి చెందిన చంద్రమౌళి చనిపోవడం బాధాకరమని, ఆయన మృతదేహం బుధవారం రాత్రి విశాఖపట్నం చేరుకోనుందని తెలిపారు. ర్యాలీలో ఎమ్మెల్యే గొండు శంకర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి, స్వచ్ఛంద సంస్థలు, కూటమి నేతలు పాల్గొన్నారు. చంద్రమౌళి కుటుంబం 30 ఏళ్ల కిందట శ్రీకాకుళంలోని కృష్ణా పార్కు సమీపంలో నివాసం ఉండేది. – శ్రీకాకుళం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పర్యాటక ప్రాంతమైన పహల్గామ్‌లో ఉగ్రవాదులు దాడి చేసి 26మందిని బలితీసుకోవడం దారుణమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. బాధితుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం తక్షణ మే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ముష్కరులు కశ్మీర్ పర్యాటక ప్రాంతంలోకి చొరబడి కాల్పులు జరపడం హేయమైన చర్య అని, దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. దాడికి నిరసనగా శ్రీకాకుళం నగరంలో వైఎస్సార్ కూడలి (ఏడురోడ్లు) వద్ద పార్టీ శ్రేణులంతా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా భద్రతా బలగాల్ని పెంచాలని, రక్షణవిభాగంలో నిఘా, భద్రత బలగాలపై కేంద్రప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కృష్ణదాస్ అన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పిరియా విజయా, మాజీ ఎమ్మె ల్యే రెడ్డి శాంతి, పార్టీ టెక్కలి ఇన్‌చార్జి పేరాడ తిలక్, ఆమదాలవలస ఇన్‌చార్జి చింతాడ రవి, వైఎస్సార్‌సీపీ తూర్పుకాపు కుల రాష్ట్ర అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, కాళింగ కుల రాష్ట్ర అధ్యక్షులు దుంపల లక్ష్మణరావు, ఉత్తరాంధ్ర జిల్లాల యవజన విభాగం అధ్యక్షుడు ఎంవీ స్వరూప్, పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి గేదెల పురుషోత్తం, ముంజేటి కృష్ణ, ఎంఏ భేగ్, మార్పు పృథ్వీ, అంబటి శ్రీనివాసరావు, మూకళ్ల తాతబాబు, బొడ్డేపల్లి రమేష్, టి.కామేశ్వరి, గొండు కృష్ణ, డాక్టర్ శ్రీనివాసపట్నాయక్, గద్దిబోయిన కృష్ణయాదవ్, పొన్నాడ రుషి, రౌతు శంకరరావు, ిసీహెచ్ భాస్కరరావు, శ్రీరామ్మూర్తి, చింతాడ రామ్మోహన్, బుక్కూరు ఉమామహేశ్వరరావు, పప్పల రమష్, సీపాన రామారావు, కె.తేజ, వానపల్లి రమేష్‌లతో పాటు అధిక సంఖ్యలో పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
తీవ్రవాదుల దాడి హేయం
కాశీబుగ్గ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో యాత్రికులపై జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. పలాసలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన బుధవారం మాట్లాడారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా మనమందరం కలిసి కట్టుగా దేశ సమైక్యతను చాటాల్సిన అవసరం ఉందన్నారు.
శ్రీకూర్మనాథాలయ ఈఓగా కె.నరసింహనాయుడు
గార: శ్రీకూర్మనాథాలయ కార్యనిర్వహణాధికారిగా కె.నరసింహనాయుడును నియమించారు. ఆయన ఇప్పటివరకు ఆర్కియాలజీ, మ్యూజియం ఏడీగా అమరావతి సర్కిల్‌లో పనిచేస్తూ దేవదాయ శాఖకు డిప్యుటేషన్ వచ్చారు. నెల రోజుల కిందటే డిప్యుటేషన్‌పై వచ్చినా ఇప్పటివరకు దేవదాయ శాఖ అనుమతి లేకపోవడంతో వెయిటింగ్‌లో ఉన్నారు. గురువారం నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు.
పర్యాటకులపై ఉగ్రదాడి దారుణం
పర్యాటకులపై ఉగ్రదాడి దారుణం
పర్యాటకులపై ఉగ్రదాడి దారుణం


