అధికార మదంపై.. అక్షర శరం
అరాచకాలకు ప్రభుత్వ మద్దతు
తమ ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలకు కూటమి ప్రభుత్వం మద్దతు పలుకుతోంది. ఏలూరులో సాక్షి కార్యాలయాన్ని ధ్వంసం చేయడం ప్రజాస్వామ్యాన్ని, పత్రికా స్వేచ్ఛను ఖూనీ చేసినట్లే. దాడికి పాల్పడ్డ ఇదే చింతమనేని గతంలో దళిత మహి ళా తహసీల్దార్‌పై కూడా విచక్షణారహితంగా ప్రవర్తించారు. చింతమనేనిపై చర్యలు తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
– కొంక్యాణ వేణుగోపాల్, ఏపీడబ్ల్యూఏఎఫ్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి
అధికార దురహంకారమిది..
ఏలూరు సాక్షి కార్యాలయంపై వందల మంది అనుచరులతో వెళ్లి ఎమ్మెల్యే చింతమనేని దాడి చేయించడం అధికార, మతోన్మాద, దురహంకారం. ఆయన తీరుతో చీకటి రోజులు గుర్తుకువస్తున్నాయి. దళిత మహిళా తహసీల్దార్‌పై గతంలో ఇలానే దాడి చేశారు. ఇప్పుడు పత్రికా కార్యాలయాలు, ప్రతినిధులపై దాడు లు చేయిస్తే ఖబడ్దార్. చింతమనేనిని బర్తరఫ్ చేయాలి. శాసనసభ సభ్యత్వాన్ని తొలగించాలి.
– కంఠా వేణు, శ్రీకాకుళం జిల్లా దళిత జేఏసీ కన్వీనరు
ముక్తకంఠంతో ఖండించాలి
మీడియాపై దాడులు ప్రజాస్వామ్యవాదులంతా ముక్తకంఠంతో ఖండించాలి. ఏలూరులో సాక్షి కార్యాలయంపై దాడిని తీవ్రంగా మా ప్రజాసంఘాలు ఖండిస్తున్నాయి. పత్రికా స్వేచ్ఛపై దాడి చేయించడంలో కూటమి ప్రభుత్వం రెచ్చగొట్టే ధోరణి కనపడుతోంది. మొన్నటికి మొన్న సాక్షి ఎడిటర్, ఆరుగురి జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టించడం, మళ్లీ ఇప్పుడు ఇలా.. ఏమనుకోవాలి వీరి చర్యలను.
– తేజేశ్వరరావు, సీఐటీయు జిల్లా కార్యదర్శి
శ్రీకాకుళం, శ్రీకాకుళం క్రైమ్ :
ఏలూరులోని ‘సాక్షి’ జిల్లా కార్యాలయంపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరుల దాడిని అక్షరంపై అధికార పార్టీ దురహంకారంగా జర్నలిస్టు సంఘాలు అభివర్ణించాయి. మొన్న టికి మొన్న ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డి మరో ఆరుగురు జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించిన సంగతి మర్చిపోక మునుపే.. ఇప్పుడు ఏకంగా టీడీపీ శాసనసభ్యుడే వేరే నియోజకవర్గంలో ఉన్న సాక్షి కార్యాలయానికి వందల మంది అనుచరులతో వెళ్లి ధ్వంసరచనకు పూనుకోవడం పత్రికారంగ చరిత్రలోనే చీకటి రోజుగా మిగిలిపోతుందని అంతా మండిపడ్డారు. గతంలో కూడా దళిత తహసీల్దారుపై దాడి చేయించిన చింతమనేనిలాంటి వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు వెనకేసుకురావడం సిగ్గుచేటని దునుమాడారు.
తక్షణమే చింతమనేనిని బర్తరఫ్ చేయాలని, శాసనసభ సభ్యత్వాన్ని తొలగించి ఆయనపై, ఆయన అనుచరులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాల ని డిమాండ్ చేశారు. జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులు బుధవారం ఈ మేరకు జిల్లా కేంద్రంలోని డేఅండ్ నైట్ కూడలి నుంచి అంబేడ్కర్ కూడలి వరకు ప్లకార్డులు చేతబూని ర్యాలీ చేశారు. అంబేడ్కర్ కూడలి వరకు వెళ్లి మానవహారంగా ఏర్ప డ్డారు. అనంతరం ఎస్పీకి వినతిపత్రం అందించేందుకు వెళ్లగా.. ఆయన లేకపోవడంతో సీఐ ఈశ్వరరావుకు అందించారు. కార్యక్రమంలో ఏపీడబ్ల్యూఎఫ్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కొంక్యాణ వేణుగోపాల్, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు జోగినాయుడు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి తేజేశ్వరరావు, జిల్లా దళిత జేఏసీ కన్వీనర్ డాక్టర్ కంఠ వేణు, జిల్లా గ్రంఽథాలయ శాఖా కన్వీనరు బుడుమూరు సూర్యారావు, ఏపీయుడబ్ల్యూజే సీనియర్ సభ్యులు జి.వి.నాగభూషణం, దళిత నాయకుడు తైక్వాండో శ్రీను, సాక్షి బ్యూరో చీఫ్ కందుల శివశంకర్, సాక్షి టీవీ బ్యూరో సునీల్, ఎల క్ట్రానిక్ మీడియా ప్రతినిధులు బీవీఎస్ నాయుడు, శ్రీనివాసరావు, బాలు, వాసు, బి.రమేష్, చిన్నారావు, ఈశ్వరరావు, ప్రసాద్, సన్యాసినాయుడు, సీనియర్ జర్నలిస్టులు వీవీఎస్‌ఎన్ శ్రీనివాస్, బగాది అప్పలనాయుడు, బలివాడ శివప్రసాద్, మల్లేశ్వరరావు, రవి తదితరులు పాల్గొన్నారు.
‘సాక్షి’ కార్యాలయంపై దాడి హేయం
ఖండించిన జర్నలిస్టులు, ప్రజా సంఘాలు
శ్రీకాకుళంలో నిరసన ప్రదర్శన
మీడియాను భయభ్రాంతులకు గురిచేస్తూ..
పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా రంగాలను భయభ్రాంతులకు గురిచేయడాన్నే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. ఏలూరు సాక్షి కార్యాలయంపై దాడి చేయించారంటే వారి తప్పు ఎత్తిచూపుతున్న సాక్షి జర్నలిస్టులపై అక్కసు కక్కినట్లే. పత్రికారంగం లేనిదే ఏ నాయకుడు అధికారంలోకి రాలేడన్నది గుర్తు పెట్టుకోవాలి.
– బుడుమూరు సూర్యారావు, జిల్లా గ్రంఽథాలయ శాఖ కన్వీనరు
వ్యక్తిగత కక్షలతోనే దాడులు..
తమ అక్రమాలను, తప్పులను రా స్తున్న పత్రికా ప్రతినిధులపై దాడిచేసే వరకు వెళ్తున్నారంటే వ్యక్తిగతంగా వారిపై కక్ష కడుతున్నారు. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తున్నారు. ఇలా చేసే ప్రభుత్వాలన్నీ తుప్పు పట్టిపోయాయి. – జి.వి.నాగభూషణం,
ఏపీయూడబ్ల్యూజే సీనియర్ సభ్యులు
ఆగడాలను అరికట్టాలి..
సాక్షి కార్యాలయంపై దెందులూరు టీడీపీ కూటమి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులతో దాడి చేయించడం అత్యంత హేయం. ఎమ్మెల్యే ఆగడాలను ఇప్పటికై నా ప్రభుత్వం అరికట్టి కేసులు పెట్టి అరెస్టు చేయాలి. మీడియా హక్కును కాపాడాలి. తప్పుడు సమాచారంతో వార్తలు రాస్తే లీగల్‌గా నోటీసులు పంపాలి తప్ప ఇలా కార్యాలయాలపై దాడులు చేయించడం ప్రభుత్వం తరఫున బాధ్యత గల ఓ శాసనసభ్యునిగా ఉన్న చింతమనేని దేనికి సంకేతమిస్తున్నట్లు.
– జోగినాయుడు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు
అధికార మదంపై.. అక్షర శరం
అధికార మదంపై.. అక్షర శరం
అధికార మదంపై.. అక్షర శరం
అధికార మదంపై.. అక్షర శరం
అధికార మదంపై.. అక్షర శరం
అధికార మదంపై.. అక్షర శరం


