ఇసుక లారీ బీభత్సం
రణస్థలం: మండల కేంద్రంలోని సూర్య స్కూల్ జంక్షన్ వద్ద బుధవారం రాత్రి 8.50 గంటల సమయంలో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న ఇసుక లారీ ముందు వ్యా నును తప్పించబోయి డివైడర్ మధ్యలో ఉన్న రెండు విద్యుత్ స్తంభాలను ఢీకొట్టి నిలిచిపోయింది. అదే సమయంలో విశాఖపట్నం వైపు నుంచి రణస్థలం ఒక కారు వస్తుండగా ఆ కారుపై విద్యుత్ స్తంభం పడిపోయింది. కారు ముందు భాగంలో పడడంతో ప్రమాదం తప్పింది. ఆ సమయంలో కారులో కృష్ణాపురం మాజీ ఎంపీటీసీ ముల్లు కృష్ణ, పల్లు కొట్లు రామకృష్ణ, ధనరాజు ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జేఆర్ పురం పంచాయతీకి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పోలీసు, విద్యుత్ శాఖ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.


