ఐదు పేపర్లే రాసి.. అద్భుత ఫలితాలు సాధించి..
పొందూరు: పదో తరగతి ఫలితాల్లో పొందూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఖనీజ్ ఫాతిమా కత్రి అరుదైన ఘనత సాధించింది. చిన్నప్పటి నుంచే కండరాల క్షీణత (మస్కులర్ డిస్ట్రోపీ) వ్యాధితో బాధపడుతున్న ఈ అమ్మాయి ఎవరైనా తోడు ఉంటేనే పాఠశాలకు వెళ్లే పరిస్థితి. అయినప్పటికీ కుంగిపోకుండా మొక్కవోని దీక్షతో చదువును కొనసాగించింది. నడవలేని పరిస్థితి అయినప్పటికీ పట్టుదలతో చదివింది. ప్రభుత్వం ఐదు పేపర్లు రాసేందుకు అనుమతి ఇవ్వడంతో 500 మార్కులకు గాను 479 మార్కు లు సాధించి స్ఫూర్తిగా నిలిచింది. విద్యార్థినితో పా టు తల్లిదండ్రులు నజీర్ ఖత్రి, సమీర ఖత్రిలను ఎంఈవోలు గట్టు శ్రీరాములు, పట్నాన రాజారా వు, హెచ్‌ఎం వెంకట్రావు, సిబ్బంది అభినందించారు.


