హామీలు అమలు చేసేదెన్నడు?
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 11 నెలలు కావస్తున్నా ఒక్క హామీ కూడా అమలుచేయకుండా అప్పుల లెక్కలు చెబుతూ కాలం గడిపేయడం సరికాదని వైఎస్సార్‌సీపీ తూర్పుకాపు కుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్ అన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో సంక్షేమం గాలికొదిలేసి వైఎస్సార్‌సీపీ నాయకులపై కక్షసాధింపులకు పాల్పడుతూ రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేయడం తగదన్నారు. నాయకుడంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలా ఉండాలని, హామీలన్నీ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే అమలుచేశారని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు అధికార దాహంతో బూటకపు హామిలిచ్చిప్రజల్ని మోసగించారని దుయ్యబట్టారు.


