● లైసెన్స్‌డ్ వైన్‌షాపుల వద్ద ‘ఓపెన్ డ్రింకింగ్’ కే
పోలాకి :
మండలంలో మద్యం సిండికేట్ దందా సాగుతోంది. వైన్‌షాపులు నడిపేవారు సిండికేట్‌గా ఏర్పడి మందుబాబుల జేబులు గుళ్లజేస్తూ తమ జేబులు నింపుకుంటున్నారు. అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలు, కొందరు పోలీసు లు, ఎకై ్సజ్ అధికారుల సమకారం పుష్కలంగా లభిస్తుండటంతో యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నారు. పోలాకి మండలంలో బెలమర, జడూరు, ఈదులవలస జంక్షన్‌లతో పాటు మండలకేంద్రం పోలాకితో కలిపి మొత్తం 5 లైసెన్స్‌డ్ మద్యం దుకాణాలు ఉన్నాయి. వాటి పరిధిలో 31 పంచాయతీల్లో అనధికారికంగా దాదాపు 40 బెల్ట్ దుకాణాలు నడుస్తున్నట్లు సమాచారం. వీ టన్నింటినీ ఒకే సిండికేట్ కిందకు తీసుకురావటంలో ఎవరి పాత్ర మేర వారు కీలకంగా వ్యవహరించారు.
బెల్టును ప్రోత్సహించేలా..
కూటమి ప్రభుత్వం వచ్చాక బెల్టుషాపు లేని ఊరు లేదనేది బహిరంగ రహస్యమే. బడ్డీకొట్లు, నివాసా లు, వీధి సందులు.. ఇలా ఎక్కడ చూసినా బెల్టు షాపులే కనిపిస్తుంటాయి. అక్కడే దర్జాగా మద్యం సేవిస్తున్నా ఎకై ్సజ్ అధికారులు గానీ, పోలీసులు గానీ పట్టించుకోరు. అదే లైసెన్స్‌డ్ దుకాణాల వద్ద తాగితే మాత్రం ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేస్తుంటారు. ఇక్కడే అసలైన మతలబు ఉంది. మందుబాబులు నేరుగా వైన్స్‌షాపుల దగ్గర కొనుగోలు చేసే దాని కన్నా బెల్ట్ నిర్వాహకుల వద్ద కొను గోలు చేస్తేనే సిండికేట్‌కు హోల్‌సేల్‌గా లాభం వస్తుంది. ప్రతి సీసాపైనా ఎంఆర్‌పీ కంటే అదనపు సొమ్మును బెల్ట్ నిర్వాహకులు అందజేస్తారు. అదే నేరుగా లైసెన్స్‌డ్ షాపుల వద్ద మందుబాబులకు విక్రయిస్తే వారు తాగిన దానికన్నా వాగిందే ఎక్కువ ఉంటుంది. దీంతో అధికార పార్టీకి చెందిన కింది స్థాయి నాయకులు బెల్టు దుకాణాలకు గిరాకీ పెరిగే లా ఈ స్కెచ్ వేశారనే అనుమానాలు వినిపిస్తున్నాయి.
ఎక్కడికక్కడే విచ్చలవిడిగా..
●పోలాకి మండలంలో బెల్ట్‌దుకాణాలు ఎక్కికక్కడే విచ్చలవిడిగా ఉన్నా అటువైపు కనీసం కన్నెత్తిచూడకుండా పోలీసులు వ్యవహరిస్తున్న తీరును చాలామంది ప్రశ్నిస్తున్నారు.
●తీరప్రాంత గుప్పెడుపేలో నెలకు రూ.30 వేలు వరకు వేలంపాట పెట్టుకుని మరీ కూటమి నాయకులు ప్రత్యేక బెల్ట్‌షాపు నడుపుతున్నారు.
●జడూరు జంక్షన్‌లో ఓ దాబాలో అక్కడే ఉన్న లైసె న్స్ వైన్‌షాప్ కన్నా ఎక్కువ ధరకు మద్యం ఏరులైపారుతున్నా కనీసం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
●వ్యాపార కేంద్రం పిన్నింటిపేట, మండలకేంద్రం పోలాకిలో బెల్ట్ దుకాణాలకు నేరుగా సరఫరా చేసే వ్యక్తులు ఏ సిండికేట్‌కు చెందినవారో పోలీసులే తేల్చాలని పలువురు కోరుతున్నారు.
●జొన్నాం తోటల్లో నేటికీ నాటువాసన పోవడం లేదని అక్కడి వారి మాట. అయినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు.
బెలమర జంక్షన్‌లోని లైసెన్స్‌డ్ వైన్స్‌షాప్
కఠినంగానే ఉంటున్నాం..
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఓపెన్ డ్రింకింగ్‌పై కేసులు నమోదు చేస్తున్నాం. గ్రామాల్లోనూ సిబ్బందిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు లు సైతం కడుతున్నాం. ప్రజలకు ఇబ్బంది కలిగించే బెల్ట్ దుకాణాలపై కూడా చర్యలు తీసుకుంటాం.
– జె.శ్రీనివాసరావు, సీఐ, నరసన్నపేట
అడ్డగోలు దోపిడీ..
ప్రభుత్వ మద్యం పాలసీ బెల్టు నిర్వాహకులకు వరంగా మారింది. లైసెన్స్ దుకాణాల వద్ద పోలీసు కేసుల నేపథ్యంలో ఎక్కువ మంది గ్రామాల్లో బెల్ట్ దుకాణాలపై ఆధారపడుతున్నారు. అక్కడ క్వార్టర్‌పై రూ.40 నుంచి రూ.60 వరకు అదనపు దోపిడీ జరుగుతంది. సిండికేట్‌కు సైతం ఇదే అవకాశంగా మారింది. బెల్ట్ దుకాణాలపై చర్యలు తీసుకోకపోతే గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం వుంది.
– రెంటికోట త్రినాథరావు, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడు, పోలాకి
● లైసెన్స్‌డ్ వైన్‌షాపుల వద్ద ‘ఓపెన్ డ్రింకింగ్’ కే
● లైసెన్స్‌డ్ వైన్‌షాపుల వద్ద ‘ఓపెన్ డ్రింకింగ్’ కే


