
కానిస్టేబుల్ అరెస్టు
టెక్కలి రూరల్: దమ్ము గోపాలం అనే పోలీస్ కానిస్టేబుల్ అరెస్టయిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై టెక్కలి సీఐ ఎ.విజయ్‌కుమార్ మాట్లాడుతూ గోపాలం గతంలో టెక్కలిలో కానిస్టేబుల్‌గా పనిచేసి ప్రస్తుతం పలాసలో విధులు నిర్వర్తిస్తున్నాడని, తనను మోసం చేశాడంటూ టెక్కలిలో ఉంటున్న ఓ మహిళ ఈ నెల 16న ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం విచారణ జరిపి కానిస్టేబుల్‌ను జిల్లా జైలుకు తరలించినట్లు చెప్పారు.
ఇచ్ఛాపురం రూరల్: వేలాది కిలోమీటర్ల దూరం నుంచి తేలుకుంచి వస్తున్న విదేశీ పక్షులు, సైబీరియన్ కొంగలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఇచ్ఛాపురం తహసీల్దార్ ఎన్.వెంకటరావు అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శనివారం తేలుకుంచి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ పాతిర్ల రాజశేఖరరెడ్డి, ఎంపీడీఓ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కె.రామారావు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.