
డిజిటల్ బుక్‌తో.. వైఎస్సార్‌సీపీ శ్రేణులకు భరోసా
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): వైఎస్సార్‌సీపీ కార్యకర్తల కు ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా వెంటనే డిజిటల్ బుక్‌లో లాగిన్ అయి వివరాలు నమోదు చేస్తే పార్టీ అండగా ఉంటుందని శ్రీకాకుళం పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భరోసా ఇచ్చారు. వేధింపులు, ఇబ్బందు లు ఎదురైతే డిజిటల్ బుక్‌లో ఫోన్ నెంబర్, ఇతర వివరాలు పొందుపరచాలని కోరారు. శ్రీకాకుళంలో ని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్‌ను పార్టీ ముఖ్య నాయకులతో కలిసి సీతారాం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల విజ యవాడలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిజిటల్ బుక్‌ను ప్రవేశపెట్టారని చెప్పారు. దీనిని అన్ని నియోజకవర్గాలు, మండలాల్లో రిలీజ్ చేసి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా నిలవాలన్నారు. ఇప్పటికే చాలామంది పార్టీ సానుభూతిపరులకు, కార్యకర్తల కు తీవ్ర అన్యాయం జరిగిందని, వాటిపై న్యాయస్థానాల్లో పోరాటం చేస్తూనే ఉన్నామన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చినవెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. డిజిటల్ బుక్‌ను టీడీపీ నేతల రెడ్‌బుక్ మాదిరి పెట్టుకున్నా మని చెప్పడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. ప్రజలకు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఎవరికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా సులువుగా సమాచారం తెలుసుకునేందు కు డిజిటల్ బుక్ పెట్టామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలు, పార్టీ రాష్ట్ర కాళింగ కుల అధ్యక్షుడు దుంపల రామారావు, వెలమ కుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంబటి శ్రీనివాసరావు, కళింగ వైశ్య కుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు, పార్టీ యువనేత ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మార్పు పృథ్వీ, పార్టీ సంయుక్త కార్యదర్శి ఎన్ని ధనుంజయరావు, నగర అధ్యక్షుడు సాధు వైకుంఠరావు, చిట్టి జనార్దనరావు, గ్రీవెన్స్‌సెల్ జిల్లా అధ్యక్షుడు రౌతు శంకరరావు, ఎంఏ బేగ్, సనపల నారాయణరావు, వై.వి.శ్రీధర్, యజ్జల గురుమూర్తి, బొడ్డేపల్లి పద్మజ, తంగుడు నాగేశ్వరరావు, గుండ హరీష్, సిహెచ్ భాస్కర్, రుప్ప అప్పలసూరి తదితరులు పాల్గొన్నారు.