
కాంప్లెక్స్ కిటకిట
● సరిపడా బస్సులు లేక ప్రయాణికుల పాట్లు
● గంటల తరబడి తప్పని నిరీక్షణ
శ్రీకాకుళం అర్బన్: దసరా సెలవుల నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిన ప్రయాణికులతో రాకపోకలు సాగిస్తున్నాయి. సెలవులకు తోడు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తుండటంతో ప్రతి బస్సు రద్దీగా కనిపిస్తోంది. సీట్లు సంగతి పక్కన పెడితే నిల్చునేందుకు కూడా జాగా లేని పరిస్థితి నెలకొంటోంది. తాజాగా ఇంటర్మీడియెట్, ఇతర ఉన్నత విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో దూరప్రాంతాల నుంచి విద్యార్థులు ఆదివారం జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం చేరుకోవడంతో కాంప్లెక్స్ కిటకిటలాడింది. ఎక్కువగా విశాఖ నుంచి నాన్‌స్టాప్ బస్సులతో పాటు సిటీ బస్సులు సైతం నాన్‌స్టాప్ బస్సులుగా నడిపారు. మరోవైపు, సకాలంలో బస్సులు రాక ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించారు.

కాంప్లెక్స్ కిటకిట