ఎన్‌ఎంఎంఎస్ పరీక్షకు 5516 మంది విద్యార్థులు హాజరు
శ్రీకాకుళం: జిల్లాలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను నిర్వహించిన జాతీయ ఉపకార వేతన ప్రతిభ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజ న్ ప్రధాన కేంద్రాల్లోని 25 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు మొత్తం 5,617 మంది విద్యార్థులకు గాను 5,516 మంది హాజ రు కాగా, 101 మంది గైర్హాజరయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్ష ప్రశాంత వాతావరణంలో జరిగిందని జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు.
సొంత నిధులతో కెమిస్ట్రీ ల్యాబ్ భవనం నిర్మాణం
కంచిలి: విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను చూసి ఆ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ స్పందించారు. ప్రాక్టికల్స్ కోసం తరగతి గదుల్ని కేటాయించడంతో చదువులు సక్రమంగా సాగడం లేద ని తనంతట తానే ముందుకొచ్చి ప్రాక్టికల్స్ కోసం సొంత వసతిని ఏర్పాటు చేయదలచుకొని, అనుకున్నదే తడవుగా సొంత నిధులు వెచ్చించి భవన నిర్మాణాన్ని చేపట్టారు. కంచిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ల్యాబ్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని గ్రహించిన కళాశాల ప్రిన్సిపాల్ ఉరిటి జగదీష్ కుమార్ తన సొంత నిధులతో భవన నిర్మాణం చేపట్టారు. ఈ కళాశాలలో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం కలిపి 158 మంది సైన్స్ గ్రూపుల విద్యార్థులు ఉన్నారు. కానీ వీరికి ల్యాబ్ సౌక ర్యం లేకపోవడంతో, ఉన్న తరగతి గదులనే రెండింటిని ల్యాబ్‌లకు కేటాయించారు. ఈ కళాశాల ప్రిన్సిపాల్‌గా జగదీష్ కుమార్ 2024 మార్చి 16న విధుల్లో చేరారు. ఇక్కడ ఈ సమస్యను గమనించిన ఆయన ఉన్నతాధికారులకు నివేదించారు. వారు ఇచ్చే నిధులు ఆలస్యం అవుతాయని భావించి, తన సొంత నిధులు రూ.1.45 లక్షలు వెచ్చించి కెమిస్ట్రీ ల్యాబ్ భవనంతోపాటు ఎలక్ట్రిఫికేషన్, సీసీ కెమెరా, ప్లంబింగ్ పనులు కూడా చేపట్టారు. దీంతోపాటు ఫిజిక్స్ ల్యాబ్ నిర్మాణానికి ఆర్‌జేడీ స్పెషల్ నిధులను మంజూరు చేయడంతో, ఆ ల్యాబ్ నిర్మాణం కూడా జరుగుతుంది. త్వరలో ఆ భవనాన్ని కూడా ప్రారంభించనున్నట్లు జగదీష్ కుమార్ తెలిపారు.
మంచుదెబ్బకు అపరాలకు తీవ్ర నష్టం
జి.సిగడాం: మంచుదెబ్బకు అపరాల పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. గత వారం రోజుల నుంచి తేనె మంచు కురవడంతో పెసర, మినుము, ఉలవ పంటలపై ఈ ప్రభావం చూపుతోంది. ఇప్పటికే రైతులు అధిక మొత్తం వెచ్చించి విత్తనాలు కొనుగోలు చేసి పొలంలో వేశారు. చేతికి అందాల్సిన పంట మంచు ప్రభావానికి నాశనం అవుతోందని చెబుతున్నారు.


