టెన్త్ ఇంటర్నల్ మార్కులపై ఆరా!
ఒక్కో బృందానికి పది పాఠశాలలు
పాఠశాలల తనిఖీకి 35 బృందాలను జిల్లా విద్యాశాఖ ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో జీహెచ్‌ఎం గాని ఎఫ్‌ఏసీ హెచ్‌ఎం గాని, ఒక లాంగ్వేజ్ పండిట్, మరో నాన్ లాంగ్వేజ్ ఉపాధ్యాయుడు, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు మరో ఇద్దరు చొప్పున ఐదుగురు సభ్యులు ఉంటాడు. ఒక్కో బృందానికి 7 నుంచి 10 పాఠశాలల బాధ్యతలను అప్పగించారు. మార్చి మొదటి వారంలో ఫ్రీఫైనల్ పరీక్షలు ఉన్నందున ఈ నెల 20లోపు ఈ తనిఖీ పూర్తి చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆన్‌లైన్‌లో ఇంటర్నల్ మార్కులు నమోదు చేస్తారు.
చిలుకూరు: పదవ తరగతి ఇంటర్నల్ మార్కుల నమోదుపై జిల్లా విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇంటర్నల్ మార్కుల నమోదు విషయంలో పాఠశాలల ఉపాధ్యాయులు ఇష్టానుసారంగా వేస్తున్నారనే ఆరోపణలు వస్తుండడంతో కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. దీనికితోడు వచ్చేనెల (మార్చి) 21వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నందున శుక్రవారం నుంచి 20వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని పరీక్షల విభాగాన్ని ఆదేశించింది. ఇందుకు ప్రత్యేక తనిఖీ బృందాలను నియమించింది.
వాస్తవాల పరిశీలనకే..
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు ఫార్మెటివ్ పరీక్షల్లో వాస్తవ మార్కులు వేశారా.. లేదా ఇష్టానుసారంగా నమోదు చేశారా.. అలాగే విద్యార్థులు చేసిన ప్రాజెక్టు వర్క్స్, చేతిరాత, ఎఫ్‌ఏలలో వచ్చిన మార్కులను ఈ బృందాలు సూక్ష్మంగా పరిశీలించనున్నాయి. వివిధ అంశాలను చూసి లోపాలుంటే వాటిని సరిచేసిన తర్వాతే ఇంటర్నల్ మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. ప్రతి సజెక్టుకు 100 మార్కులు ఉండగా 80 మార్కులకు వార్షిక పరీక్ష ఉంటుంది. మిగిలిన 20 మార్కులకు సీసీఈ విధానంలో నాలుగు ఫార్మెటివ్ అసెన్‌మెంట్ పరీక్షల ఫలితాలు, విద్యార్థులు రాసే రికార్డుల ఆధారంగా మార్కులు కేటాయిస్తారు. దీంట్లో భాగంగా శుక్రవారం చిలుకూరు జెడ్పీహెచ్‌తోపాటు వివిధ పాఠశాలల్లో ప్రత్యేక బృందాల తనిఖీలు కొనసాగాయి.
ఫ ఇష్టానుసారంగా మార్కులు వేయకుండా కట్టడి
ఫ క్షేత్రస్థాయిలో తనిఖీలకు 35 బృందాలు
ఫ జిల్లాలో 355 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు
జెడ్పీ, ప్రభుత్వ పాఠశాలలు 184
ప్రైవేట్ పాఠశాలలు 121
కేజీబీవీలు, గురుకులాలు 50
మొత్తం విద్యార్థులు 11,912
Comments
Please login to add a commentAdd a comment