సోషల్ మీడియా కీలకపాత్ర పోషించాలి
ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హుజూర్‌నగర్: ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేసేలా సోషల్ మీడియా కీలక పాత్ర పోషించాలని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సూచించారు. సోమవారం హైదరాబాద్‌లోని తన ఇంటివద్ద హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లోని సోషల్ మీడియా వారియర్స్‌తో సమావేశం నిర్వహించి మాట్లాడారు. హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాలు నాకు రెండు కళ్లలాంటివని వాటి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో జరగుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సోషల్ మీడియా వారియర్స్‌ను కోరారు. సోషల్ మీడియా వారియర్స్‌కు దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియా రంగంలో అనుభవం కలిగిన శ్రీధర్ రామస్వామిని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రత్యేకించి సోషల్ మీడియా ఇన్‌చార్జిగా నియమించారు. ఈ కార్యక్రమంలో పలువురు సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment