ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలి
అర్వపల్లి: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్‌తో కలిసి గురువారం జాజిరెడ్డిగూడెం శివారులోని మూసీ నది, మన ఇసుక – మన వాహనం కింద అమలవుతున్న తుంగగూడెంలోని ఇసుక రీచ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతులు ఉన్న ఇసుక రీచ్‌లలో అనుమతించిన వాహనాలు మాత్రమే ఇసుకను తీసుకెళ్లాలని సూచించారు. జాజిరెడ్డిగూడెం మూసీనది నుంచి సీతారామ ప్రాజెక్ట్, మున్నేరు ప్రాజెక్ట్, శివన్నగూడెం ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి ఇసుక అనుమతులు ఉన్నందున ఇక్కడి నుంచి రవాణా మొదలుకు ముందే పోలీస్, రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్ తదితర శాఖలతో కలిసి విజిలెన్స్ మానిటరింగ్ టాస్క్‌ఫోర్స్ టీంలను ఏర్పాటు చేయాలన్నారు. అర్వపల్లి తహసీల్దార్ కార్యాలయం, సూర్యాపేటలోని టీఎస్‌ఎండీసీ కార్యాలయంలో జీపీఎస్ ట్రాకింగ్ సిస్టం ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పర్యవేక్షించాలన్నారు. ఇసుకను రీచ్‌ల నుంచి పంపే సమయంలో సీసీ కెమెరాల ముందు తూకం వేయాలన్నారు. తుంగగూడెంలోని మన ఇసుక–మన వాహనం రీచ్‌కు వెళ్లే దారి సరిగా లేనందున ఈ రోడ్డు మరమ్మతులకు ప్రతిపాదనలు పంపిస్తే నిధులు మంజూరు చేస్తానని చెప్పారు. ప్రతి వారం రోజులకోసారి ఇసుక రవాణాపై తహసీల్దార్ అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించాలని సూచించారు. కాగా ఇక్కడ అమలవుతున్న సాండ్ టాక్స్ విధానం గురించి తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాసులు కలెక్టర్, ఎస్పీలకు వివరించారు. కార్యక్రమంలో మైనింగ్ శాఖ ఏజీ విజయరామరాజు, టీఎస్‌ఎండీసీ ఉమ్మడి జిల్లా పీఓ శ్రీరాములు, సూర్యాపేట ఆర్‌డీఓ వేణుమాదవ్‌రావ్, తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాసులు, నాగారం సీఐ రఘువీర్‌రెడ్డి, ఎంపీడీఓ గోపి, స్థానిక ఎస్‌ఐ బాలకృష్ణ, గిర్దావర్ పాటి వెంకట్‌రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ జలేందర్‌రావ్, కార్యదర్శులు నెహ్రూనాయక్, నవీన్, సిబ్బంది అశోక్, ఆకాష్, రమేష్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
Comments
Please login to add a commentAdd a comment