గడువులోపు సీఎంఆర్ పంపించాలి
భానుపురి (సూర్యాపేట) : సీఎంఆర్ బకాయి గడువు లోపు పంపించాలని అదనపు కలెక్టర్ రాంబాబు ఆదేశించారు. గురువారం అదనపు కలెక్టర్ సమావేశ మందిరంలో మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్చి 17 లోపు రబీ 2022–23కు సంబంధించి ఇచ్చిన గడువు లోపు ఎఫ్‌సీఐ లేదా పౌర సరఫరాల శాఖకు పంపించాలని సూచించారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేశ్వర్, డీఎం ప్రసాద్, సివిల్ సప్లయ్ డీటీలు, ఆర్‌ఐలు, అధికారులు పాల్గొన్నారు.
టీబీ రహిత సమాజానికి కృషి చేయాలి
గరిడేపల్లి: టీబీ రహిత సమాజానికి కృషి చేయాలని డీఎంహెచ్‌ఓ కోటాచలం అన్నారు. గురువారం గరిడేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం మండల పరిధిలోని గారకుంట తండాలో నిక్షయ్ శివిర్ శిబిరాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండు వారాల పాటు దగ్గు, జ్వరం, బరువు తగ్గిపోవడం, రాత్రిపూట జ్వరం, చెమట పట్టడం, ఆయాసం ఉంటే 100రోజుల నిక్షయ్ శివిర్‌లో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆయన వెంట వైద్యాధికారి నరేష్, ఎస్‌ఓ వీరయ్య, టీబీ నోడల్ సూపర్‌వైజర్ అంజయ్యగౌడ్, ఎంహెల్‌ఎచ్‌పీఎస్ అశోక్, సాయి, శ్రీనివాస్, ఉపేందర్, రమ్య, మమత, విజయ, కవిత తదితరులు ఉన్నారు.
లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
చివ్వెంల(సూర్యాపేట): మార్చి 8న నిర్వహించే జాతీయ మెగాలోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీవాణి కోరారు. గురువారం జిల్లా ఇన్‌చార్జ్ ప్రధాన న్యాయమూర్తి శ్యామ్ శ్రీ ఆదేశాల మేరకు జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులకు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజీ మార్గమే రాజ మార్గమని, కోర్టులో పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. సివిల్, క్రిమిసన్, వెహికల్, ఎకై ్సజ్, బ్యాంకు, విద్యుత్ వంటి కేసులు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళీ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నూకల సుదర్శన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డపుకు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
గడువులోపు సీఎంఆర్ పంపించాలి
గడువులోపు సీఎంఆర్ పంపించాలి
Comments
Please login to add a commentAdd a comment