హుండీ ఆదాయం లెక్కింపు
ఫ గతంలో కంటే రూ.5.58 లక్షలు
పెరిగిన ఆదాయం
చివ్వెంల(సూర్యాపేట): పెద్దగట్టు ఆలయ హుండీల్లో భక్తులు సమర్పించుకున్న నగదు, కానుకలను గురువారం లెక్కించారు. 2023లో జరిగిన జాతరలో రూ.27,71, 294 ఆదాయం రాగా.. ప్రస్తుతం రూ.31,29,686 వచ్చినట్లు ఆలయ ఈఓ కుశలయ్య తెలిపారు. గతంలో కంటే రూ.5.58 లక్షలు పెరిగినట్లు పేర్కొన్నారు. అదే విధంగా 425 గ్రాముల మిశ్రమ వెండి వచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పోలేబోయిన నర్సయ్య యాదవ్, తహసీల్దార్ కృష్ణయ్య, దేవాదాయ శాఖ పరిశీలకురాలు సుమతి, ఈఓ కుశలయ్య, డైరెక్టర్లు వీరబోయిన సైదులు, కుర్ర సైదులు, మెంతబోయిన లింగస్వామి, చిన్న మల్లయ్య, పోలేబోయిన నరేష్, సైదమ్మ పాల్గొన్నారు.
హుండీ ఆదాయం లెక్కింపు
Comments
Please login to add a commentAdd a comment