పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
తిరుమలగిరి(తుంగతుర్తి): రాష్ట్రప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుంతకండ్ల దామోదరరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెల్ల సీతా రామయ్య డిమాండ్ చేశారు. తిరుమలగిరి పట్టణంలో రూ.50 లక్షలతో నిర్మించిన ఆ సంఘం నూతన భవనాన్ని సోమవారం వారు ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు రావాల్సిన నాలు గు డీఏలను వెంటనే చెల్లించాలని, రెండవ పీఆర్‌సీ కమిటీ నివేదికను అమలు చేయాలని కోరారు. అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఎంప్లాయీస్ హెల్త్‌కార్డుల ద్వారా నగదు రహిత వైద్యం అందేలా చూడాలన్నారు. 2024 మార్చి తర్వాత రిటైర్డ్ అయిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పి.చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షుడు ఎన్.సుదర్శన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాంబాబు, సహాయ కార్యదర్శులు ఎం.పద్మారెడ్డి, సారంగుల నర్సయ్య, విఠల్‌రెడ్డి, జి.సుదర్శన్‌రావు, నర్సయ్య, సత్యనారాయణ పాల్గొన్నారు.
ఫ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామోదరరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment