దురాజ్‌పల్లి జాతరకు అంతా సిద్ధం
చివ్వెంల(సూర్యాపేట): దురాజ్‌పల్లిలోని శ్రీలింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతరకు అంతా సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. శుక్రవారం ఆయన పెద్దగట్టు వద్ద జాతర పనులు పరిశీలించారు. అనంతరం గట్టుపైన వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ఈనెల 16 నుంచి 20 వరకు జాతర జరగనున్న నేపథ్యంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. గతంలో కంటే ఈసారి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. బందోబస్త్‌కు 2 వేల మంది పోలీస్ సిబ్బందిని నియమించామన్నారు. మూడు షిఫ్టుల్లో 90 మంది పారిశుద్ధ్య సిబ్బంది ఐదు రోజుల పాటు విధులు నిర్వహిస్తారన్నారు. మరో 37 మంది అధికారులు పర్యవేక్షిస్తారన్నారు. లైటింగ్, తాగునీటి సౌకర్యంతోపాటు ఎనిమిది చోట్ల ప్రాథమిక చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మూడు అంబులెన్స్‌లు, మూడు అగ్నిమాపక వాహనాలు అందుబాటులో ఉంచామన్నారు. ఐదురోజుల పాటు ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. జాతరలో ఎలాంటి సమస్యలు తలెత్తిన జాతర నోడల్ అధికారి ఆర్‌డీఓ వేణుమాదవ్‌కు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు, పెద్దగట్టు ఆలయ కమిటీ చైర్మన్ పోలెబోయిన నర్సయ్య యాదవ్, సీపీఓ ఎల్.కిషన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం, డీఎస్‌పీ రవి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్లు శ్యాంసుందర్ రెడ్డి, కృష్ణయ్య, ఈఓ కుశలయ్య, ఇంట్రా ఈఈ శ్రీనివాస్‌రావు, గ్రిడ్ ఈఈ కర్ణాకర్‌రెడ్డి, విద్యుత్ శాఖ అధికారి పాల్‌రాజ్, ఏడీఈ రాముల నాయక్, జిల్లా అగ్నిమాపక అధికారి నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
Comments
Please login to add a commentAdd a comment