ఫ గుంటకండ్ల జగదీష్‌రెడ్డి
దేశానికి దిక్సూచిలా కేసీఆర్ నిలుస్తారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ వెనుకబాటును చూసి చలించి గులాబీ జెండా ఎత్తారని, ఒక్కడిగా బయలుదేరి నేడు సముద్రంలా మారారని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో దేశం వెనుకబాటుకు గురవుతోందని, ఇక్కడ ఆయన శిష్యుడు రేవంత్ అదే బాటలో పయనిస్తున్నాడని ఆరోపించారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ వచ్చే నెల 27న జరిగే వరంగల్ బహిరంగ సభకు భారీ ఎత్తున కార్యకర్తలు, నాయకులు తరలిరావాలన్నారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కోసం పార్టీ పెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఆ తర్వాత పదేళ్లు అధికారంలో ఉండి అభివృద్ధి చేసి దేశం మొత్తం చూసేలా చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ ఇక్కడ ఉన్న మంత్రి రెండు నియోజకవర్గాలకే మంత్రి అని, ఆయన రావాలంటే హెలికాప్టర్ ఉండాలన్నారు. హెలికాప్టర్ లేనిది ఆ మంత్రి ఎక్కడకి పోరని విమర్శించారు. అంతకు ముందు జనగామ క్రాస్‌రోడ్డు నుంచి పార్టీ కార్యాలయం వరకు కేటీఆర్‌కు స్వాగతం పలుకుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, భాస్కరరావు, రవీంద్రకుమార్, నోముల భగత్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నాయకులు ఒంటెద్దు నర్సింహారెడ్డి, సోమా భరత్‌కుమార్, తిప్పన విజయసింహారెడ్డి, ఎలిమినేటి సందీప్‌రెడ్డి, చెరుకు సుధాకర్, గుజ్జా దీపిక, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, వై.వెంకటేశ్వర్లు, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, పెరుమాళ్ల అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.


