తొలి రోజు 11,882 మంది హాజరు
సూర్యాపేట టౌన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 67 కేంద్రాల్లో మొదటి రోజు తెలుగు పరీక్ష నిర్వహించారు. మొత్తం 11,904 మంది విద్యార్థులకు గాను 11,882 మంది హాజరు కాగా 22 మంది గైర్హాజరయ్యారు. ఇందులో 11 మంది ప్రైవేట్ విద్యార్థులకు ఎనిమిది మంది హాజరు కాగా ముగ్గురు గైర్హాజరయ్యారు. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్ష ప్రశాంతంగా కొనసాగింది. విద్యార్థులకు ఈ ఏడాది అడిషనల్ పేపర్లకు బదులుగా 24పేజీల ఆన్సర్ బుక్‌లెట్‌ను ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను అదనపు కలెక్టర్ రాంబాబు, ఎస్పీ నరసింహ తనిఖీ చేశారు. అలాగే నాలుగు స్క్వాడ్ బృందాలు పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్ష సమయంలో విద్యార్థులకు ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని ఎస్పీ పోలీస్ అధికారులను ఆదేశించారు.
పదో తరగతి పరీక్షలు ప్రారంభం
ఫ జిల్లా వ్యాప్తంగా 22 మంది
విద్యార్థులు గైర్హాజరు
ఫ పలు కేంద్రాలను తనిఖీ చేసిన
అదనపు కలెక్టర్, ఎస్పీ
తొలి రోజు 11,882 మంది హాజరు
Comments
Please login to add a commentAdd a comment