
అంగన్‌వాడీలకు పక్కా భవనాలు
నాగారం : అంగన్‌వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు సమకూరనున్నాయి. మొదటి విడతలో జిల్లాకు 69 అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు మంజురయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం అరకొర వసతులు, అద్దె భవనాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. దీంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పక్కాభవనాల నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉపాధి హామీ నుంచి కొన్ని నిధులు మంజూరు చేసింది.
ఒక్కో భవనానికిరూ.12 లక్షల చొప్పున ప్రతిపాదనలు
జిల్లా వ్యాప్తంగా 23 మండలాల పరిధిలో మొత్తం ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిఽధిలో 1,209 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో మూడేళ్లలోపు చిన్నారులు 25,139 మంది, 3 నుంచి 6ఏళ్లలోపు చిన్నారులు 14,819 మంది నమోదై ఉన్నారు. అయితే మొత్తం కేంద్రాల్లో 306 కేంద్రాలకు సొంత భవనాలుండగా, 451 కేంద్రాలు సమీప పాఠశాలల్లో నిర్వహిస్తున్నారు. ఇక 452 కేంద్రాలు అద్దెభవనాల్లో కొనసాగుతున్నాయి. తాజా ఆదేశాల ప్రకారం జిల్లాలో మొదటి విడతగా 69 భవనాల నిర్మాణం చేపట్టన్నారు. ఇందుకోసం ఒక్కో భవనానికి రూ.12లక్షలు ప్రతిపాదించారు. వీటిలో ఉపాధి హామీ పథకం నుంచి రూ.8.50 లక్షలు ప్రస్తుతం మంజూరయ్యాయి. 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.2 లక్షలు, సొంత శాఖ లేదా కలెక్టర్ నుంచి రూ.1.50 లక్షల చొప్పున నిధులు రావాల్సి ఉంది.
పూర్తిస్థాయిలో నిధులు రాగానే పనులు
జిల్లాకు 69 అంగన్ వాడీ కేంద్రాలకు సొంత భవనాలు మంజూరయ్యాయి. ప్రస్తుతం ఉపాధిహామీ పథకం నుంచి నిధులు వచ్చాయి. పూర్తిస్థాయిలో నిధులు మంజూరుకాగానే భవనాల నిర్మాణ పనులను ప్రారంభిస్తాం.
–నర్సింహారావు,
జిల్లా సంక్షేమ అధికారి, సూర్యాపేట.
ఫ మొదటి విడతగా 69 కేంద్రాలకు
సొంతభవనాలు
ఫ ఒక్కోభవనానికి రూ.12లక్షల
చొప్పున ప్రతిపాదనలు
ఫ ప్రస్తుతం ఉపాధి నిధులు
రూ.8.50 లక్షల చొప్పున మంజూరు

అంగన్‌వాడీలకు పక్కా భవనాలు