సూర్యాపేట టౌన్: వాహనదారులు రోడ్డు భద్రత నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కె.నరసింహ హెచ్చరించారు. శుక్రవారం సూర్యాపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బందికి ట్రాఫిక్ నియంత్రణ, వాహనాలు, డ్రంకన్ డ్రైవ్ తనిఖీల సమయంలో వాడే భద్రతా సామగ్రి, బ్రీత్ అనలైజర్ పరికరాలు అందజేసి మాట్లాడారు. అనంతరం జిల్లా హోంగార్డ్ ఆర్గనైజేషన్‌లో పనిచేస్తూ అనారోగ్య కారణంగా వైద్యం చేయించుకున్న ఇద్దరికి మెడికల్ రీయింబర్స్ మెంట్ కింద చెక్కువలు అందజేశారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ నరసింహాచారి, సీఐ వీరరాఘవులు, ఆర్‌ఐ నారాయణరాజు, ఎస్‌ఐలు సాయిరామ్, బాలునాయక్, మహేశ్వర్ పాల్గొన్నారు.


