దొడ్డి కొమురయ్య జీవితం.. స్ఫూర్తిదాయకం
భానుపురి: నిజాం ప్రభువుల అరాచక పాలన, భూస్వాములు, పెత్తందారులను ఎదురించి తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని, అమరుల త్యాగాలు వెలకట్టలేనివని అదనపు కలెక్టర్ పి.రాంబాబు అన్నారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్‌లో దొడ్డి కొమురయ్య జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ వీవీ.అప్పారావు, బీసీ వెల్ఫేర్ అధికారి శ్రీనివాస్ నాయక్, డీడబ్ల్యూఓ నరసింహారావు, సంక్షేమ అధికారులు లత, శంకర్, జగదీశ్వర్‌రెడ్డి, వివిధ కుల సంఘాల ప్రతినిధులు వజ్జే వీరయ్య, డాక్టర్ రామ్మూర్తి, పోలెబోయిన నర్సయ్య, పుల్లయ్య, అధికారులు పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ రాంబాబు


