అందం, అభినయం నటి ఐశ్వర్య మీనన్ సొంతం. తమిళ్ పడం– 2 చిత్రంతో కోలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ మలయాళ బ్యూటీ ఆ తర్వాత వరుసగా నాన్ సిరిత్తాళ్, వేళం, తమిళ్ యాంకర్స్, తదితర చిత్రాల్లో నటించి కోలీవుడ్లో తనకంటూ మంచి పేరును సంపాదించుకున్నారు. చిత్రాలతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ తరచూ అందమైన ఫొటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను రంజింపజేస్తున్న ఐశ్వర్య మీనన్ తాజాగా టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర కానున్నారు. అవును అక్కడ పాన్ ఇండియా కథా చిత్రాల్లో నటించడానికి సిద్ధమవుతున్నారు.
ఇటీవల విడుదలైన తెలుగు చిత్రం కార్తీకేయ– 2. ఇది భారీ విజయాన్ని సాధించడంతో పాటు, అనూహ్యంగా, బాలీవుడ్‌లోనూ వసూళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఆ చిత్ర కథానాయకుడు నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న నూతన చిత్రం స్పై. ఇది పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ఇందులో నటి ఐశ్వర్య మీనన్ కథానాయకగా ఎంపిక అయ్యారు. దీని గురించి ఆమె తెలుపుతూ స్పై వంటి పాన్ ఇండియా చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు.
అదేవిధంగా తమిళంలో అజిత్ హీరోగా నటించిన వలిమై చిత్రంలో విలన్‌గా నటించిన కార్తికేయ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రంలోని తాను హీరోయిన్‌గా నటించినట్లు చెప్పారు. అదేవిధంగా మరికొన్ని లేడీ ఓరియంటెడ్ కథా చిత్రాల్లో నటించే విషయమై చర్చలు జరుగుతున్నట్లు నటి ఐశ్వర్య మీనన్ తెలిపారు. మొత్తం మీద ఈ బ్యూటీ టాలీవుడ్ లో చాలా స్ట్రాంగ్‌గా పాగా వేస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా మలయాళం, తెలుగు, తమిళం చిత్రాల్లో నటిస్తూ బహు భాషా నటిగా కూడా రాణిస్తున్నారు.
టాలీవుడ్‌లో బిజీగా ఐశ్వర్య మీనన్
Published Fri, Mar 24 2023 6:18 AM | Last Updated on Sat, Mar 25 2023 3:10 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment