గవర్నర్‌తో స్పీకర్ భేటీ
6న అసెంబ్లీ సమావేశం
సాక్షి, చైన్నె: కొత్త సంవత్సరంలో తొలి సమావేశానికి హాజరుకావాలని గవర్నర్ ఆర్‌ఎన్ రవిని అసెంబ్లీ స్పీకర్ అప్పావు ఆహ్వానించారు. ఈనెల 6న అసెంబ్లీ ప్రారంభం కానుంది. ప్రతి ఏటా కొత్త సంవత్సరం తొలి అసెంబ్లీ సమావేశం గవర్నర్ ప్రసంగంతో మొదలెట్టడం రాష్ట్రంలో ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే.
గవర్నర్‌గా ఆర్‌ఎన్ రవి బాధ్యతలు స్వీకరించినానంతరం మూడవ సంవత్సరంగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఈనెల 6న సభ ప్రారంభం కానున్న నేపథ్యంలో గవర్నర్ రవిని ఆహ్వానించేందుకు స్పీకర్ అప్పావు శుక్రవారం ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్‌తో కాసేపు సమావేశమయ్యారు. తొలి సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానించారు. ఈసందర్భంగా తన ప్రసంగం పాఠం గురించి స్పీకర్‌తో గవర్నర్ సమాచారం రాబట్టినట్టు సంకేతాలు వెలువడ్డాయి.
రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిని, భవిష్యత్తులో చేపట్టబోయే అంశాలను వివరించే విధంగా గవర్నర్ ప్రసంగంలో అంశాలను పాలకుల పేర్కొనడం జరుగుతోంది. అయితే, ఈ ప్రసంగాలను గవర్నర్ రవి గత రెండేళ్లు పక్కన పెట్టారు. తొలిసారిగా అయితే, పెద్ద దుమారమే సభలో చోటుచేసుకుంది. గవర్నర్‌కు వ్యతిరేకంగా సభలో డీఎంకే పాలకులు తీర్మానం కూడా ప్రవేశ పెట్టారు.
ఈ సందర్భంగా గత ఏడాది ప్రభుత్వ ప్రసంగాన్ని గవర్నర్ పక్కన పడేశారు. తొలి పేజీ, చివరి పేజీని మాత్రం చదివి సభ నుంచి బయటకు వచ్చేయడం మళ్లీ చర్చకు, రచ్చకు దారి తీసింది. తాజాగా మూడో సంవత్సరంగా సభలో అడుగు పెట్టబోతున్న గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఎలా స్పందించనున్నారో అనే చర్చ ఇప్పటికే అందరిలో సాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ రవిని స్పీకర్ కలవడం, సభకు రావాలని ఆహ్వానించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment