ఆత్మ విశ్వాసమే నా బలం
తమిళ సినిమా: సమీప కాలంలో బాగా వార్తల్లో నాని నటుడు విశాల్. అందుకు కారణం ఆయన వైరల్ ఫీవ ర్కు గురికావడమే. కొద్దిరోజుల క్రితం వైరల్ ఫీవర్ అలాంటి పరిస్థితుల్లోనూ ఈనెల 5వ తేదీన చైన్నెలో జ రిగిన ఆయన నటించిన మాదగజరాజు చిత్ర మీడి యా సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆ యన మాటలు తడబడటం, చేతులు వణకడం వంటి దృశ్యాలు పలువురు పలు రకాలుగా మాట్లాడుకోవడానికి కారణమయ్యాయి కొందరు విశాల్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుకున్నా, మరికొందరు ఆయన ఆరోగ్యం గురించి పెడర్థాలు తీశా రు. ఇలాంటి పరిస్థితుల్లో శనివారం చైన్నెలోని సత్యం థియేటర్లో ఏర్పాటుచేసిన మదగజరాజా చిత్రం ప్రి వ్యూకు విచ్చేసిన నటుడు విశాల్ చాలా ఆరోగ్యంగా క నిపించారు. చెయ్యి వణకడం వంటివి లేకుండా మీడి యాతో చాలా చక్కగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ తనను ఎందరో అభిమానిస్తున్నారు. అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని ఫోన్ ద్వారా మెసేజ్ ద్వారా పలువురు పేర్కొన్నారు అన్నారు. ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని తనకు వచ్చింది సాధారణ వైరల్ ఫీవర్ నేనని, ఇప్పు డు తగ్గిపోయిందని చెప్పారు. ఇటీవల ఫీవర్ అధికంగా ఉండడంతో తన తల్లిదండ్రులు బయటకు వెళ్లవ ద్దని చెప్పారన్నారు. అయితే అద్దంలో చూసుకున్నప్పు డు కనిపించింది దర్శకుడు సుందర్ సి, మదగజ రాజ చిత్ర లోగో నేనని చెప్పారు. అందుకే ఈ చిత్ర మీడి యా సమావేశానికి వచ్చానని చెప్పారు. తాను జ్వరం కారణంగా అపోలో ఆసుపత్రిలో గానీ కావేరి ఆసు పత్రిలో గాని చేరలేదని, కొందరు మాత్రం మరో మూ డు లేదా ఆరు నెలల వరకు విశాల్ షూటింగ్‌కు రారని ప్రచారం చేశారన్నారు. తన ఆత్మవిశ్వాసం, తన తండ్రి ఆత్మవిశ్వా సమే తనకు బలమని పేర్కొన్నారు. అవి ఉన్నంతవ రకు తాను ఎన్ని అ వాంతరాలనైనా ఎదుర్కొంటా నన్నారు.
Comments
Please login to add a commentAdd a comment