ప్రాంతాల వారీగా పర్యటన..
సాక్షి, చైన్నె: డీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చినానంతరం రైతు ప్రయోజనాల దృష్ట్యా, తమిళనాటు వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ రూపకల్పనకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు 2021–22 సంవత్సరానికి గాను తొలి వ్యవసాయ బడ్జెట్ తమిళనాడు అసెంబ్లీలో దాఖలైంది. అప్పటి నుంచి ఏటా ఆర్థిక బడ్జెట్ దాఖలు తదుపరి వ్యసాయ బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశ పెడుతూ వస్తున్నారు. ఇందులో పూర్తిగా వ్యవసాయం, అన్నదాత ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు, పథకాలు, నిధుల కేటాయింపునకు సంబంఽధించిన సమగ్ర వివరాలు ఉంటాయి. 2025–26 సంవత్సరానికి గాను రాష్ట్ర అసెంబ్లీలో మార్చి నెలలో 5వ సారిగా వ్యవసాయ బడ్జెట్ దాఖలకు ఆశాఖ మంత్రి ఎంఆర్‌కే పన్నీరు సెల్వం కసరత్తులను వేగవంతం చేశారు. పూర్తిస్థాయిలో వ్యవసాయ బడ్జెట్ దాఖలుకు ఇదే ప్రస్తుత ప్రభుత్వంలో చివరి అవకాశం. 2026లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనున్నడం ఇందుకు కారణం. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని అన్నదాతల ఓటు బ్యాంక్‌ను గురి పెట్టి, వారి సంక్షేమాన్ని, వ్యవసాయ ప్రగతిని కాంక్షిస్తూ కొత్త పథకాలు,అంశాలను బడ్జెట్‌లో పొందు పరిచే పనిలో పడ్డారు. ఓ వైపు ఆర్థిక బడ్జెట్‌ను మార్చి 14వ తేదీ సభలో దాఖలు చేయడమే లక్ష్యంగా ఆ శాఖ మంత్రి తంగం తెన్నరసు ఆయా శాఖల వారీగా మంత్రులు, అధికారులతో రోజూ సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. అదే సమయంలో వ్యవసాయ బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి నేరుగా రైతుల వద్దకే వెళ్లేందుకు వ్యవసాయ మంత్రి ఎంఆర్‌కే పన్నీరు సెల్వం సిద్ధమయ్యారు.
కసరత్తులలో మంత్రి ఎంఆర్‌కే
అన్నదాతలతో వరుస భేటీలు
వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ నేతృత్వంలో కొద్ది రోజుల క్రితం సచివాలయంలో డెల్టా జిల్లాలోని ఎనిమిది జిల్లాలను ఏకం చేస్తూ రైతులు, వ్యవసాయ సంఘ ప్రతినిధి, నిపుణులు, రాజకీయ వర్గాల ప్రతినిధులు అంటూ 700 మందితో సమీక్ష జరిగింది. సర్వత్రా ఈ సమావేశంలో పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, సమస్యలు, రైతు ప్రయోజనాలు, అవసరాలను వివరించారు. ఈ పరిస్థితులలో ఈనెల 25వ తేదీ నుంచి వ్యవసాయ ఆధారితంగా ఉన్న మత్స్య కారుల సంక్షేమం, పశు సంవర్థకం, తదితర విభాగాల మంత్రులు, అధికారులు, ప్రతినిధులతో సచివాలయంలో సమావేశానికి ఎంఆర్‌కే పన్నీరు సెల్వం నిర్ణయించారు. అలాగే ఈనెల 26వ తేదీన తిరునెల్వేలి జిల్లాలో జవహర్‌లాల్ నెహ్రూ ఆడిటోరియంలో మున్సిపల్ పరిపాలన, పట్టణ, నీటి సరఫరా సరఫరాల విభాగాల మంత్రులు,అధికారుల పాటూ రైతు ప్రతినిధులు, నిపుణులతో సమావేశానికి ఏర్పాట్లు చేసుకున్నారు. 27వ తేదీన తిరుచ్చి జిల్లా ఆర్ట్ గ్యాలరీలో మునిసిపల్ పరిపాలన, నీటిపారుదల, విద్య శాఖల మంత్రులు, అధికారులతో సమావేశం జరగనుంది. మార్చి 2వ తేదీన తిరువళ్లూరు జిల్లా వైద్య కళాశాల ఆడిటోరియంలో మైనారిటీ సంక్షేమం, తమిళ సంక్షేమ శాఖమంత్రులు, అధికారులు, నిపుణులతో సంప్రదింపులు సమావేశాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ సమావేశాలకు కేవలం మంత్రులేకాదు, ఎంపీలు,ఎంపీలు, వ్యవసాయ ప్రతినిధులు, వ్యవసాయం, దాని సంబంధిత ఈ రంగం నిపుణుల నుంచి సలహాలు, సూచనలు, అభిప్రాయాలను సేకరించనున్నారు. దీనికి అనుగుణంగా సమగ్ర ప్రణాళికలతో బడ్జెట్ రూపకల్పన చేయనున్నారు. వ్యవసాయ ఉత్పత్తిని పెంచి రైతుల జీవనోపాధిని మెరుగుపరచడం రైతు సంక్షేమానికి సంబంధించిన వ్యవసాయాన్ని మెరుగుపరచడానికి బడ్జెట్ నివేదిక రూపకల్పన నిమిత్తం అందరూ తమ తమఅభిప్రాయాలు, సమస్యలు, సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ముందుకు రావాలని రైతుసంఘాలు, రైతులు, ప్రతినిధులు, నిపుణులను మంత్రి ఎంఆర్‌కే పన్నీరు సెల్వం విజ్ఞప్తి చేశారు.
అందరి అభీష్టం, ఆమోదంతో ఈసారి రైతు బడ్జెట్ కసరత్తులలో వ్యవసాయ మంత్రి ఎంఆర్‌కే పన్నీరు సెల్వం నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా అన్నదాతలు, వ్యవసాయ నిపుణులతో రీజినల్ వారిగా సమావేశాలతో అభిప్రాయ సేకరణకు సిద్ధమయ్యారు.
ప్రాంతాల వారీగా పర్యటన..
Comments
Please login to add a commentAdd a comment