కాళియమ్మాల్ ‘కన్నెర్ర
● సీమాన్ పార్టీకి బై..బై
సాక్షి, చైన్నె: నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్‌కు ఆ పార్టీ మహిళా విభాగం కన్వీనర్ కాళియమ్మాల్ షాక్ ఇచ్చారు. ఆ పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధమవుతున్నారు. వివరాలు.. నామ్ తమిళర్ కట్చి కన్వీనర్ సీమాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఎన్నికలలోనూ ఓటు బ్యాంక్‌ను ఆ పార్టీ పెంచుకుంటూ, ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తింపు దక్కించుకుంది. అయితే ఇటీవల కాలంగా ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్‌కు వ్యతిరేకంగా సీమాన్ చేస్తూ వచ్చిన వ్యాఖ్యలతో అనేక మంది జిల్లాల కార్యదర్శులు ఆయనకు బై..బై చెప్పేశారు. ఎక్కువ శాతం మంది విజయ్ తమిళగ వెట్రి కళళగం వైపుగా చూసే పనిలో పడ్డారు.
కాళియమ్మాల్ వంతు..
అనేక మంది కార్యదర్శులు, నేతల బాటలో ప్రస్తుతం కాళియమ్మాల్ కూడా ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. జాలర్ల కుటుంబానికి చెందిన కాళియమ్మాల్ చక్కటి వాక్ చాతుర్యం కలిగిన వారు. నాగపట్నం లోక్‌సభతో పాటూ పలు అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేసి ఓడినా, కనీస ఓట్లను దక్కించుకున్నారు. నామ్ తమిళర్ కట్చిలతో సీమాన్ తదుపరి స్థానంలో కాళియమ్మాల్ ఉండే వారు. ఆ పార్టీ మహిళా విభాగానికి ఆది నుంచి కన్వీనర్‌గా ఉంటూ వచ్చిన ఆమె ప్రస్తుతం బయటకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. కాళియమ్మాల్‌ను సీమాన్ దూషించినట్టుగా పేర్కొంటూ ఓ ఆడియో సామాజిక మాధ్యమాలలో శనివారం వైరల్‌గా మారింది. ఈ ఆడియో తదుపరి కాళియామ్మల్ సీమాన్ పార్టీని వీడేందుకు నిర్ణయించినట్టు మద్దతుదారులు పేర్కొంటున్నారు. అదే సమయంలో శనివారం తూత్తుకుడిలో జరిగిన ఓకార్యక్రమం ఆహ్వానంలో కాళియామ్మల్ పక్కన నామ్ తమిళర్ కట్చి అన్నది తొలగించి సామాజిక సేవకురాలు అని పేర్కొనడం గమనార్హం. నామ్ తమిళర్ కట్చి నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమైన ఆమె విజయ్ తమిళగ వెట్రి కళగంలో చేరడానికి ఉత్సాహం చూపుతున్నట్టు సమాచారం. విజయ్ వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే, సీమాన్ పార్టీకి రాజీనామా చేసి తమిళగ వెట్రి కళగం కండువాను కప్పుకునేందుకు కాళియమ్మాల్ సిద్ధమవుతున్నట్లు చర్చ సాగుతోంది. ఈనెల 26న మహాబలిపురం వేదికగా జరగనున్న తమిళగ వెట్రికళగం ఆవిర్భావ వేడుక సభ వేదికగా కాళియమ్మాల్ విజయ్ సమక్షంలో పార్టీలో చేరవచ్చు అన్న సంకేతాలు వెలువడ్డాయి. కాళియామ్మల్ బయటకు వెళ్లినపక్షంలో నామ్ తమిళర్ కట్చి నుంచి పెద్దఎత్తున మహిళా నేతలు క్యూ కట్టే అవకాశాలు అధికమే. అదే సమయంలో కాళియామ్మల్ తోపాటూ మరెందరో బయటకు వెళ్లినా..ఐ యామ్ డోంట్ కేర్ అంటూ సీమాన్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment