● జాతీయ విద్యా విధానం అమలుపై సీఎం స్టాలిన్‌ స్పష్టీకరణ ● కడలూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం ● నాన్న యాప్‌ ఆవిష్కరణ ● పేరెంట్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ వేడుకకు హాజరు | - | Sakshi
Sakshi News home page

● జాతీయ విద్యా విధానం అమలుపై సీఎం స్టాలిన్‌ స్పష్టీకరణ ● కడలూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం ● నాన్న యాప్‌ ఆవిష్కరణ ● పేరెంట్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ వేడుకకు హాజరు

Published Sun, Feb 23 2025 1:50 AM | Last Updated on Sun, Feb 23 2025 1:48 AM

● జాత

● జాతీయ విద్యా విధానం అమలుపై సీఎం స్టాలిన్‌ స్పష్టీకరణ

రెండు వేలకోట్లు కాదు.. పది వేల కోట్ల రూపాయాలు ఇచ్చినా జాతీయ విద్యా విధానాన్ని తమిళనాడులోకి అనుమతిస్తూ సంతకం పెట్టే ప్రసక్తే లేదని సీఎం స్టాలిన్‌ స్పష్టం చేశారు. ఈ విషయంలో సంతకం పెడితే తమిళనాడు 2 వేల సంవత్సరాల వెనక్కి వెళ్లినట్టేనని వ్యాఖ్యానించారు. కడలూరులో జరిగిన అభివృద్ధి పనుల శ్రీకారం వేడుకలో విద్యాశాఖ నేతృత్వంలో ‘అప్పా’ (నాన్న) యాప్‌ను సీఎం ఆవిష్కరించారు.

పేరంట్‌ టీచర్స్‌ మహానాడు వేదికపై పిల్లలు, వారి తల్లిదండ్రులతో సీఎం స్టాలిన్‌

సాక్షి, చైన్నె : రెండు రోజుల క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా సీఎం స్టాలిన్‌ శనివారం కూడా కడలూరులో పర్యటించారు. తొలి రోజున కడలూరులోని మంజకుప్పం మైదానంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో రూ.1476 కోట్ల విలువైన 602 పూర్తయిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, కొత్తగా చేపట్టనున్న 178 ప్రాజెక్టులకు శంకుస్థాపనలను సీఎం చేశారు. 44,689 మంది లబ్ధిదారులకు సంక్షేమ సహాయాన్ని అందించారు. రెండవ రోజైన శనివారం కడలూరు జిల్లా విరుదాచలంలో సెలబ్రేట్‌ పేరెంట్స్‌ మహానాడుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి నైవేలి నుంచి బయలుదేరిన స్టాలిన్‌కు దారి పొడవున జనం నీరాజనాలు పలుకుతూ ఆహ్వానం పలికారు. కొన్ని కిలో మీటర్ల దూరం నడుచుకుంటూ జనాన్ని పలకరిస్తూ,కరచాలనంచేస్తూ, వినతి పత్రాలనుస్వీకరిస్తూ, జనంతో సెల్పీలు దిగుతూ విరుదాచలంకు సీఎం చేరుకున్నారు. పాఠశాల విద్య, తమిళనాడు రాష్ట్ర తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘం నేతృత్వంలో జరిగిన ‘సెలబ్రేట్‌ పేరెంట్స్‌’ మహానాడు వేదికపై నుంచి 132 ప్రభుత్వ పాఠశాలలలో రూ. 177 కోట్ల వ్యయంతో నిర్మించిన తరగతి గదులు, ల్యాబ్‌లు తదితర భవనాలను సీఎం ప్రారంభించారు. తమిళనాడు రాష్ట్ర తల్లిదండ్రులు –ఉపాధ్యాయ సంఘం కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. అలాగే, తమిళనాడు పేరంట్స్‌ – టీచర్స్‌ 234/77 –ఒరుమైకన్‌ యాప్‌ , ‘అప్పా‘ (నాన్న) పేరిట యాప్‌ను ప్రారంభించారు. 234 నియోజకవర్గాలలోనూ రికార్డులు, ప్రభుత్వ బడులలో 77 సౌకార్యాలను గురించి వివరించే విధంగా తొలి యాప్‌ రూపకల్పన చేశారు. ఇది ఒక ఈ–పుస్తకంగా తీర్చిదిద్దారు. విద్యా పరంగా తమిళనాడులో ఇలాంటి అప్లికేషన్‌ను ప్రపథమంగా రూపకల్పం చేశారు. ‘తమిళనాడు పేరెంట్‌–టీచర్‌ అసోసియేషన్‌ – ‘అప్పా‘ పేరిట రూపకల్పన చేసిన యాప్‌ విద్యా అనుభవాన్ని మెరుగుపరచడానికి ఒక ఈ వినూత్న వేదిక తీర్చిదిద్దారు. అలాగే మహానాడు సంచికను ఆవిష్కరించారు. పాఠశాలల పిల్లలను శ్రేయస్సును మెరుగుపరిచే విధంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య మంచి సంబంధాలను ఏర్పరిచే విధంగా లెట్స్‌ సెలబ్రేట్‌ పేరెంట్స్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కడలూరు, విల్లుపురం, తిరువణ్ణామలై, పెరంబలూర్‌, అరియలూర్‌, కళ్లకురిచ్చి మైలాడుతురై జిల్లాల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెద్దఎత్తున తరలి వచ్చారు.ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలకు విరాళాలు ఇచ్చిన దాతలను సీఎం సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్ముడి, ఎంఆర్‌కే పన్నీరుసెల్వం, అన్బిల్‌ మహేశ్‌ పొయ్యామొళి, ఎస్‌.ఎస్‌. శివశంకర్‌, సివి గణేశన్‌, పార్లమెంట్‌ సభ్యుడు విష్ణు ప్రసాద్‌, శాసనసభ్యులు రాధాకృష్ణన్‌, రాజేంద్రన్‌, అయ్యప్పన్‌, తల్లిదండ్రుల ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీవీపీ ముత్తుకుమార్‌, తమిళనాడు పాఠ్య పుస్తకం కార్పొరేషన్‌ చైర్మన్‌ దిండుగల్‌ ఐ. లియోనీ, పాఠశాల విద్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ డా. బి. చంద్రమోహన్‌, విద్యా సేవల కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పి. శంకర్‌, కడలూరు జిల్లా కలెక్టర్‌ సీబీ ఆదిత్య సెంథిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రాణం కంటే తమిళానికే విలువ..

ఈ కార్యక్రమంలో సీఎం స్టాలిన్‌ ప్రాణాల కంటే తమిళానికే ఎక్కువ విలువ అంటూ ప్రసంగాన్ని మొదలెట్టారు. ఒక భాషను మరో భాష నాశనం చేయడానికి ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తమిళనాడు ప్రభుత్వం చేసే ప్రతి పని ఒక విజయమే! ఇందులో విద్య కూడా ఉందంటూ ఈ రంగంలో ప్రపంచ స్థాయి విజయాలు సాధిస్తున్నామని వివరించారు. ప్రతి విద్యార్థి తమిళనాడు సంపదకు ప్రతీక అని, ఈ సంపదను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. తమిళనాడులో పాఠశాల విద్య స్వర్ణయుగంగా పరిగణిస్తారని, విద్యా రంగాన్ని అద్భుతమైన రీతిలో అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు. పాఠశాల విద్య భారతదేశంలో రెండవ స్థానానికి దక్కించుకుని ఉన్నట్టు పేర్కొన్నారు. 22,931 స్మార్ట్‌ తరగతి గదులను ఏర్పాటు చేశామని, 8,209 హైటెక్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేశామని, కళా ఉత్సవాలు, వివిధ పోటీలు,ఉపాధ్యాయులలో నైపుణ్యాల పెంపునకు విదేశీ పర్యటనలు అంటూ 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పాఠశాలలను విద్యా మంత్రి అన్బిల్‌ మహేశ్‌ ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ , అభివృద్ధి పరుస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. తన ప్రభుత్వానికి విద్య, ఆరోగ సంరక్షణ రెండు కళ్లుగా ఉన్నాయని, ఇందులో పాఠశాల విద్యా శాఖకు ఏటా రూ. 44 వేల కోట్లు అందజేస్తున్నామన్నారు. నాణ్యమైన విద్యను అందించడంలో తమిళనాడు భారతదేశంలోనే అత్యుత్తమంగా ఉందని పేర్కొంటూ, అందరికీ విద్య అనే నినాదంతో దూసుకెళ్తున్నామన్నారు. అయితే కేంద్రంలోని పాలకులు తమిళనాడులో విద్య నాణ్యతను దెబ్బతీయడమే లక్ష్యంగా కుట్రలు చేస్తున్నదని ధ్వజమెత్తారు. తమిళనాడుకు రావాల్సిన నిధులను ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

10 వేల కోట్లు ఇచ్చినా..

10 వేల కోట్లు ఇచ్చినా..

కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు 2,152 కోట్ల రూపాయలు ఈ ఏడాది విద్యకు ఇవ్వలేదని గుర్తు చేస్తూ, ఇందుకోసం జాతీయ విద్యా విధానంలో చేరాలని, సంతకంపెట్టాలని ఒత్తిడి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ విద్యా విధానం అన్నది తమిళాన్ని లక్ష్యంగా చేసుకున్న ఓ విధానం. తమిళుల కోసం ఉన్న తమిళనాడును లక్ష్యంగా చేసుకున్న విధానం.. పిల్లలు భవిష్యత్తుకు ముప్పు కలిగించడమే లక్ష్యంగా రూపకల్పన చేసిన విధానం అని ధ్వజమెత్తారు. ఇతర భాషలకు ప్రత్యేకంగా తమిళం ఉంటుందని, మనకు శత్రువులు లేరని పేర్కొంటూ, అయితే, తమిళంపై బలవంతంగా మరో భాషను రుద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలను తాము సహించబోమన్నారు. హిందీని తమపై రుద్దడం గురించి మాత్రమే ఆందోళన చెందుతున్నామన్నారు. ఇది విద్యార్థుల జీవితాలను ప్రశ్నార్థకం చేస్తుందని, మధ్యలో చదువులను ఆపే పరిస్థితిని తీసుకొస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానంలో అనేక చిక్కుముడులు ఉన్నాయని పేర్కొంటూ, ఇందులో సామాజిక న్యాయం నీరుగార్చడం, షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు, ఇతర వెనుకబడిన తరగతుల విద్యార్థులకు సాయం కరువు కావడం, మూడవ తరగతిలో పబ్లిక్‌ పరీక్ష – ఐదవ తరగతిలో పబ్లిక్‌ పరీక్ష – ఎనిమిదో తరగతిలో పబ్లిక్‌ పరీక్ష అంటూ పిల్లలను బడిమానేసే విధంగా అవకాశాలు కల్పించే అంశాలు ఉన్నాయని వివరించారు. అలాగే, 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సెమిస్టర్‌ పరీక్షా విధానం అమలు చేస్తూ వారికి నచ్చిన కోర్సులు చదవాలే గానీ, పిల్లలకు నచ్చిన కోర్సులు ఎంపిక చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయని వివరించారు. ఈ విద్యా విధానంపై సంతకం చేస్తే తమిళనాడుకు రూ. 2 వేలకోట్లు వస్తాయని, అయితే, ఆ తర్వాత జరిగే నష్టానికి, ఎదురయ్యే పరిస్థితుల తప్పులను ఈ ముత్తువేల్‌ కరుణానిధి స్టాలిన్‌ ఎప్పటికీ చేయడు...అంటూ ఈసందర్భంగా తల్లిదండ్రులకు కొన్ని సూచనలు చేశారు. . హిందీ మన శత్రువు కాదు.. ఎవరికై నా ఆ భాష కావాలంటే వారు హిందీ ప్రచార సభకు లేదా ఇతర మార్గాల వైపుగా వెళ్లి చదువుకునేందుకు ఎన్నడూ అడ్డు పడలేదని వ్యాఖ్యలు చేశారు. అయితే, బలవంతంగా హిందీని రుద్దడానికి ప్రయత్నించవద్దని, బలవంతం చేస్తే తమిళనాడు తన సత్తా చూపిస్తుందని హెచ్చరించారు. ద్విభాషా విధానం తమిళనాడు విద్యార్థుల నైపుణ్యాలను పెంచిందని, తమిళ భాషపై మరో భాష ఆధిప్యతం చెలాయించే ప్రయత్నం చేస్తే సహించబోమని , పది వేలకోట్ల రూపాయలు ఇచ్చినా జాతీయ విద్యా విధానంపై సంతకం పెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమ పిల్లల భవిష్యత్తే ప్రభుత్వానికి ముఖ్యం అని , బలవంతం చేస్తే తమ ఆగ్రహాన్ని రుచి చూపించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
● జాతీయ విద్యా విధానం అమలుపై సీఎం స్టాలిన్‌ స్పష్టీకరణ 1
1/3

● జాతీయ విద్యా విధానం అమలుపై సీఎం స్టాలిన్‌ స్పష్టీకరణ

● జాతీయ విద్యా విధానం అమలుపై సీఎం స్టాలిన్‌ స్పష్టీకరణ 2
2/3

● జాతీయ విద్యా విధానం అమలుపై సీఎం స్టాలిన్‌ స్పష్టీకరణ

● జాతీయ విద్యా విధానం అమలుపై సీఎం స్టాలిన్‌ స్పష్టీకరణ 3
3/3

● జాతీయ విద్యా విధానం అమలుపై సీఎం స్టాలిన్‌ స్పష్టీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement