చదువులమ్మ ఒడికి చిన్నారులు
● వేడుకగా మొదటి తరగతి ప్రవేశం ప్రారంభోత్సవం
సేలం: సేలంలోని కొండపనాయక్కన్‌పట్టి గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మొదటి తరగతిలో ప్రవేశం ప్రారంభోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. 2025–2026 విద్యా సంవత్సరానికి మొదటి తరగతి ప్రవేశ వేడుక సేలం సమీపంలోని కొండప్పనాయకన్‌పట్టిలోని పంచాయతీ యూనియన్ ప్రాథమిక పాఠశాలలో జరిగింది. 60 మందికి పైగా విద్యార్థులు వారి తల్లిదండ్రులతో వచ్చి మొదటి తరగతిలో చేరారు. కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖాధికారి వి.తంగదురై ప్రారంభించారు. పాఠశాల హెచ్‌ఎం సి.ఆంథోని, ఉపాధ్యాయుడు పి.గాబ్రియేల్ అధ్యక్షత వహించారు. మాజీ పంచాయతీ అధ్యక్షుడు కె.ఎం.రాజు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. అలాగే ఈ వేడుకలో పాండిచ్చేరి ఈసీహెచ్ ఫౌండేషన్ తరఫున పాఠశాల ప్రిన్సిపల్, సి.ఆంథోనీకి 2025 సంవత్సరానికి ఉత్తమ అభ్యాసం, బోధన ఉపాధ్యాయుడిగా విద్యా శ్రీ అవార్డును అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment