ఇళ్ల నిర్మాణాలకు ఆన్‌లైన్‌లో అనుమతి
వేలూరు: గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు ప్రభుత్వ ఇల్లు నిర్మించుకునేందుకు ఆన్‌లైన్‌లో అనుమతి ఇవ్వనున్నట్లు కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. వేలూరు కలెక్టరేట్‌లో జిల్లాలోని కాట్పాడి, వేలూరు, అనకట్టు, కన్నియంబాడి యూనియన్ పరిధిలోని గ్రామ పంచాయతీ సర్పంచ్‌లతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో ఇది వరకే ఇల్లు కట్టుకున్న వారికి ఇంటి పన్నుతో పాటు నీటి పన్ను వేసి వారి వద్ద వసూలు చేయాల్సిన బాధ్యత సర్పంచ్, కార్యదర్శులపై ఉందన్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లోనూ పన్నులు వసూలు చేయడంలో కాలయాపన జరుగుతోందని వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామంలోని అందరికీ శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేయాలని ప్రభుత్వ నిబంధన ఉందని, ప్రతి ఇంటికి నీటి కనెక్షన్‌లు మంజూరు చేయాలన్నారు. వేసవి కాలం రానున్న నేపథ్యంలో తాగునీటి సమస్యపై ప్రత్యేక శ్రద్ధవహించాలన్నారు. గ్రామాల్లోని రోడ్లను ఆరు నెలల్లోపు పూర్తి చేయాలన్నారు. అనంతరం వివిధ సమస్యలపై సమీక్షించారు. సమావేశంలో గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టు అధికారి సెంథిల్‌కుమరన్, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment