రెండో పాట
వీర ధీర శూరన్ చిత్రం నుంచి
తమిళసినిమా: చియాన్ విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న 62వ చిత్రం వీర ధీర శూరన్. నటి దుషార విజయన్ నాయకిగా నటిస్తున్న ఇందులో నటుడు ఎస్‌జే సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. హెచ్‌ఆర్ పిక్చర్స్ పతాకంపై హెచ్‌ఆర్ రియా శింబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సేతుపతి, చిత్తా చిత్రాల ఫేమ్ అరుణ్ కుమార్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్స్ కథా చిత్రంగా రూపొందుతోంది. విక్రమ్ కాళీ అనే గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న వీర ధీర శూరన్ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. కాగా చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లను ఇటీవల విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను తెచ్చుకున్నాయి. అదేవిధంగా ఇంతకుముందు చిత్రంలోని కల్లూరుమ్ కార్తీ ౠన్ మేల్ అనే పల్లవితో సాగే పాటలు విడుదల చేశారు. దీనికి విశేష ఆదరణ లభించింది. పక్కా కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతున్న వీర ధీర శూరన్ చిత్రంపై మంచి అంచనాలు నెలకొంటున్నాయి. కాగా తాజాగా ఆది అడి ఆది అనే పల్లవితో సాగి రెండవ పాటను చిత్ర వర్గాలు గురువారం విడుదల చేయనున్నారు. ఫైవ్ స్టార్ పిక్చర్స్ సెంథిల్ పొందడం విశేషం. చిత్రం సమ్మర్ స్పెషల్ విడుదలకు ముస్తాబవుతోంది.
వీర ధీర శూరన్ చిత్రంలో విక్రమ్, దుషారా విజయన్
Comments
Please login to add a commentAdd a comment