● కళాశాల విద్యార్థిని అరెస్ట్
తిరువొత్తియూరు: చైన్నె అశోక్ నగర్ 19వ వీధిలో ఉన్న బహుళ అంతస్తుల భవనంలో నివాసముంటున్న మణి ఇతని భార్య కళావతి విశ్రాంత అధ్యాపకురాలు. వీరి కుమారుడు సెంథిల్ అమెరికాలో కుటుంబంతో సహా నివాసం ఉంటున్నాడు. వృద్ధుడు అయిన తల్లిదండ్రులు చూసుకోవడానికి తిరువళ్లూరుకు చెందిన ప్రైవేటు కళాశాల కళాశాలలో బీకాం రెండవ సంవత్సరం చదువుతున్న పచ్చయమ్మాల్‌ను పెట్టారు. ఆమె వారి ఇంటిలో ఉంటూ కళాశాలకు వెళ్లి వస్తున్నట్లు తెలిసింది. ఆ సమయంలో మనీ ఏటీఎం కార్డునుతన వద్ద వుంచుకొని ఆ కార్డ్ ద్వారా ఇంటికి అవసరమైన వస్తువులు తీసుకొస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకొని రూ. 10 లక్షల వరకు మోసం టోకరా వేసింది. దీని గురించి మణికి వస్తున్న మెసేజ్‌లను అతనికి తెలియకుండా వాటిని డిలీట్ చేస్తూ వచ్చింది. దీంతో మణికి మోసం చేస్తున్న సంగతి కి తెలియలేదు. ఈ క్రమంలో గత జనవరి నెలలోమణి అనారోగ్యంతో మృతి చెందాడు. అతని కుమారుడు సెంథిల్ ఇంటికి వచ్చి బ్యాంకు లావాదేవీలు సరి చూశాడు. ఆ సమయంలో పచ్చమ్మాల్ రూ. 10 లక్షల నగదు, 17సవర్లు నగలు అపహరించినట్లు తెలిసింది. దీని గురించి కేకే నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి కళాశాల విద్యార్థిని పచ్చయమ్మాల్‌ను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment