క్విజ్‌బైట్స్ 3.0 విజేతలకు బహుమతుల ప్రదానం
సాక్షి, చైన్నె: చైన్నెలోని జీఆర్‌టీ గ్రాండ్‌లో ఇస్పహాని సెంటర్ నిర్వహించిన క్విజ్‌బైట్స్ 3.0 విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. దక్షిణభారత దేశంలోని పలు రాష్ట్రాల నుంచి 100 మందికి పైగా చెఫ్‌లు ఈ పోటీలలో తమ అద్భుత పాక పరిజ్ఞానం, నైపుణ్యాన్ని చాటుకున్నారు. క్విజ్‌బైట్స్ 3.0 విజేతలుగా మొదటి స్థానం టీం గ్రాండ్ – కాకినాడ, రెండవ స్థానం టీం అంబ్రోసియా దక్కించుకున్నాయి. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియన్ క్యులినరీ అసోసియేషన్(ఎస్‌ఐసీఏ)అధ్యక్షుడు చెఫ్ దామోదరన్, ప్రధానకార్యదర్శి చెఫ్ శీతలామ్ ప్రసాద్ పాల్గొని క్విజ్‌బైట్స్ 3.0 ను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. వారి నాయకత్వంలో పోటీలు సజావుగా జరిగాయి. చెఫ్ దామోదరన్ మాట్లాడుతూ క్విజ్‌బైట్స్ 3.0 అనేది దక్షిణ భారతదేశ పాక సమాజంలోని అసాధారణ ప్రతిభను ప్రదర్శించే ఒక ఉత్తేజకరమైన కార్యక్రమంగా పేర్కొన్నారు. చెఫ్‌లు తమ సృజనాత్మకత, జ్ఞానం, నైపుణ్యం పెంపొందించుకునేందుకు వేదికగా పేర్కొన్నారు. ఇస్పహాని సెంటర్ డైరెక్టర్ కేసన్ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో చెఫ్‌ల పెరుగుతున్న ప్రాముఖ్యతను, వారి అద్భుతమైన సామర్థ్యాన్ని, ప్రతిభను వెలికి తీసే విధంగా పోటీలు విజయవంతమైనట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment